News May 9, 2024

బేర్ పంజా.. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 1062 పాయింట్లు కోల్పోయి 72,404కు చేరింది. మరోవైపు నిఫ్టీ 345 పాయింట్లు నష్టపోయి 22వేల మార్క్ దిగువకు (21,957 పాయింట్లు) పడిపోయింది. ఆటో మొబైల్ రంగం మినహా ఇతర ప్రధాన రంగాల షేర్లు అన్నీ నష్టాలు నమోదు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపించింది. నిఫ్టీలో గరిష్ఠంగా ఆయిల్ & గ్యాస్ రంగం 3.2% నష్టాన్ని నమోదు చేసింది.

Similar News

News December 25, 2024

అఫ్గానిస్థాన్‌పై పాక్ ఎయిర్‌స్ట్రైక్.. 15 మంది మృతి!

image

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వరుస ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. జెట్స్ ద్వారా బాంబులతో దాడి చేయగా పక్టికా ప్రావిన్స్‌లోని బార్మల్ జిల్లాలో చిన్నపిల్లలు, మహిళలతో సహా 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, దాడులపై పాకిస్థాన్ అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అఫ్గాన్ బార్డర్లో దాక్కున్న తాలిబన్లను లక్ష్యంగా దాడులు చేసినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

News December 25, 2024

సన్నరకం ధాన్యానికి రూ.939 కోట్ల బోనస్

image

TG: ఈ సీజన్‌లో ఇప్పటివరకు 18.78 లక్షల టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటికి రూ.939 కోట్లు బోనస్ ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే రూ.531 కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే సమయానికి 41.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సారి 6 లక్షల టన్నులు అధికంగా సేకరించినట్లు అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణలో కామారెడ్డి, NZB, మెదక్ ముందు వరుసలో ఉన్నాయి.

News December 25, 2024

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

image

TG: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పెంచారు. నేటితో గడువు ముగియనుండగా, ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు. మరోసారి గడువు పెంపు ఉండదని సమాచారం. రాష్ట్రంలో ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.