News December 25, 2024
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

TG: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పెంచారు. నేటితో గడువు ముగియనుండగా, ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు. మరోసారి గడువు పెంపు ఉండదని సమాచారం. రాష్ట్రంలో ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News April 19, 2026
గవర్నర్‌తో సీఎం భేటీ.. ఎమ్మెల్సీల ఆమోదంపై చర్చ?

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ HYDలోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరామ్, అజహరుద్దీన్ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏ సభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది.
News April 19, 2026
SRH బ్యాక్ బోన్.. కన్సిస్టెంట్ క్లాసెన్

ఐపీఎల్-2026లో SRH బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచుల్లో వరుసగా 31(22), 52(35), 62(41), 39(33), 40(26), 59(39) పరుగులు చేశారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో తొలి స్థానంలో(283) కొనసాగుతున్నారు. జట్టు త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడల్లా ఆచితూచి ఆడుతూ, లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలిస్తూ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకలా నిలుస్తున్నారు.
News April 19, 2026
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ట్వీట్లు

రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ్టి 2 ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. నిన్న సర్జరీ చేయించుకున్న Dy.CM పవన్ వేగంగా కోలుకోవాలని YCP చీఫ్ జగన్ ట్వీట్ చేయగా, పవన్ థాంక్స్ చెప్పారు. ఇక జగన్ తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి లోకేశ్ విషెస్ తెలిపారు. నిత్యం రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా పోట్లాడుకునే నేతలు హుందాతనం చూపడం రాజకీయాల విలువలను పెంచుతాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


