News May 10, 2024

పాకిస్థాన్‌ను గౌరవించకుంటే అణు బాంబు వేస్తారు: కాంగ్రెస్ నేత

image

సైనిక చర్యలతో పాకిస్థాన్‌ను కవ్వించాలని చూస్తే అది భారత్‌కే నష్టమని కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ దేశంతో దౌత్యపరమైన చర్చలకే భారత్ ప్రాధాన్యం ఇవ్వాలి. వారి వద్ద కూడా ఆటమ్ బాంబులు ఉన్నాయి. లాహోర్‌పై ఆటమ్ బాంబు వేయాలని చూస్తే అమృత్‌సర్‌‌కు 8 సెకన్లలో రేడియేషన్‌ పాకుతుంది. మనం గౌరవిస్తే వారు ప్రశాంతంగా ఉంటారు. రెచ్చగొడితే వారు మనపై అణుబాంబు వేయొచ్చు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 26, 2024

PHOTO: క్లీంకారతో రామ్ చరణ్-ఉపాసన

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లీంకారతో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రీ వద్ద వీరు ఫొటోకు ఫోజులిచ్చారు. అయితే క్లీంకార ముఖాన్ని కనిపించకుండా దాచేశారు. ఈ ఫొటోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు. RC నటించిన గేమ్ ఛేంజర్ మూవీ JAN 10న థియేటర్లలో విడుదల కానుంది.

News December 26, 2024

రేవంత్.. మీ పిట్ట బెదిరింపులకు భయపడం: హరీశ్

image

TG: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామ్యమని మండిపడ్డారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు. హోంమంత్రిగానూ శాంతి భద్రతల నిర్వహణలో రేవంత్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

News December 26, 2024

ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ?

image

AP: జనవరి 1న నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 31వ తేదీనే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ నేతలు చేసిన వినతికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఒకటో తేదీన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.