News May 10, 2024
పదేళ్ల తర్వాత ఆత్మకూరు గడ్డలో ‘ఆనం’ పోటీ

నెల్లూరు(D) ఆత్మకూరులో ప్రతిష్ఠాత్మక పోరు నడుస్తోంది. మాజీ CM బెజవాడ గోపాలరెడ్డి గెలిచిన గడ్డ ఇది. ఇక్కడ CONG 9సార్లు, TDP 2, YCP (బైపోల్ సహా) 3సార్లు నెగ్గాయి. 2009లో ఇక్కడ MLAగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి పదేళ్ల తర్వాత తిరిగి ఇక్కడ TDP నుంచి బరిలో నిలిచారు. గతంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కలిసొస్తాయని ధీమాగా ఉన్నారు. YCP తరఫున సిట్టింగ్ MLA మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 19, 2026
కవిత కొత్త పార్టీ.. పేరు ఇదే

TG: జాగృతి చీఫ్ కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆమె జనవరి 23నే దరఖాస్తు చేశారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దరఖాస్తులో లోపాలున్నాయని ECI తరఫు న్యాయవాది FEB 27న న్యాయస్థానానికి తెలిపారు. ఈ అంశంపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.
News March 19, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,780 తగ్గి రూ.1,54,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,550 పతనమై రూ.1,41,750గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 19, 2026
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇంధన కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం ప్రతీకార దాడులకు దిగడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ పరిణామాలతో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 112 డాలర్లకు చేరడం భయాలను పెంచింది. సెన్సెక్స్ 1,545 పాయింట్లు కోల్పోయి 75,148 వద్ద.. నిఫ్టీ 467 పాయింట్లు నష్టపోయి 23,313 దగ్గర కొనసాగుతోంది. పవర్ గ్రిడ్, NTPC షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.


