News May 10, 2024
పదేళ్ల తర్వాత ఆత్మకూరు గడ్డలో ‘ఆనం’ పోటీ

నెల్లూరు(D) ఆత్మకూరులో ప్రతిష్ఠాత్మక పోరు నడుస్తోంది. మాజీ CM బెజవాడ గోపాలరెడ్డి గెలిచిన గడ్డ ఇది. ఇక్కడ CONG 9సార్లు, TDP 2, YCP (బైపోల్ సహా) 3సార్లు నెగ్గాయి. 2009లో ఇక్కడ MLAగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి పదేళ్ల తర్వాత తిరిగి ఇక్కడ TDP నుంచి బరిలో నిలిచారు. గతంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కలిసొస్తాయని ధీమాగా ఉన్నారు. YCP తరఫున సిట్టింగ్ MLA మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News February 19, 2025
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

AP: మద్దతు ధర లేక ఇబ్బందిపడుతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యవసాయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని సూచించారు. 50శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టం భరించాలని లేఖలో విన్నవించారు.
News February 19, 2025
ఇవాళ అంతర్జాతీయ ‘టగ్ ఆఫ్ వార్’ డే

రెండు జట్లు తాడు లాగుతూ పోటీపడే ఆటను టగ్ ఆఫ్ వార్ అంటారు. రెండు జట్ల మధ్య ఒక గీతను గీసి తాడు లాగడంపై పోటీ నిర్వహిస్తారు. ఎనిమిది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రత్యర్థి జట్టును గీత తాకేలా ఎవరైతే లాగుతారో వారే విజేతగా నిలుస్తారు. సరదా కోసం ఆడే ఈ ఆట 1900 నుంచి 1920 వరకు ఒలింపిక్స్‌లో కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఆట ఆడుతుంటారు. మీరూ ఎప్పుడైనా ఆడారా?
News February 19, 2025
మోనాలిసాకు బిగ్ షాక్?

కుంభమేళాలో వైరలయిన మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ మూవీలో నటించనున్నారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే నిలిచిపోయేలా కనిపిస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాగుబోతని సినీ నిర్మాత జితేంద్ర ఆరోపించారు. ‘సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడు. అతని ఒక్క సినిమా విడుదల కాలేదు. మోనాలిసాను వాడుకుంటున్నాడు’ అని జితేంద్ర పేర్కొన్నారు. దీనిని మిశ్రా ఖండించారు.