News May 10, 2024
ఆ యూట్యూబ్ ఛానల్స్‌ను నియంత్రించాల్సిన సమయం వచ్చింది: కోర్టు
నియంత్రణ లేకుండా సమాజానికి విఘాతం కలిగించేలా ప్రసారాలు చేస్తోన్న యూట్యూబ్ ఛానల్స్‌ను నియంత్రించాల్సిన సమయం వచ్చిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో సవుక్కు శంకర్ అనే వ్యక్తి మహిళా పోలీసు సిబ్బందిపై అవమానకర ప్రకటనలు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా ఫెలిక్స్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Similar News
News December 26, 2024
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ?
AP: జనవరి 1న నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 31వ తేదీనే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ నేతలు చేసిన వినతికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఒకటో తేదీన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.
News December 26, 2024
నక్కపల్లికి మరో ఫార్మా సెజ్: సీఎం రమేశ్
AP: విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కొత్తగా ఫార్మా సెజ్ ఏర్పాటుకానుందని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. జనవరి 9న ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. సుమారు 1800 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిపై కేంద్రం సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. అలాగే పూడిమడక వద్ద రూ.75వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
News December 26, 2024
‘పుష్ప-2’: ఆ పాట డిలీట్
‘పుష్ప-2’లోని ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ప్రస్తుతం T SERIES తెలుగు ఛానల్లో ఈ వీడియో కనిపించడం లేదు. కాగా, అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించిన డిసెంబర్ 24న సాయంత్రం ఈ పాటను టీ సిరీస్ విడుదల చేసింది. ఈ సాంగ్ పోలీసులను ఉద్దేశించే అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పరిణామాలతో ఈ పాటను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.