News May 10, 2024

ఈవీఎంలను టచ్ చేస్తే తాట తీస్తా: ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

image

AP: ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడే వారిని వదిలిపెట్టబోమని వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు. ‘పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడిన వారిని వెంటాడి కొట్టుకుంటూ తీసుకొస్తా. ఈవీఎంలను టచ్ చేస్తే తాట తీస్తా. 20 రోజులు అదే పనిలో ఉంటా. కేసులతో పాటు జిల్లా బహిష్కరణకు కూడా వెనుకాడం. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు అందరూ సహకరించాలి’ అని ఎస్పీ పిలుపునిచ్చారు.

Similar News

News December 26, 2024

బెనిఫిట్ షోలు ఉండవు: సీఎం రేవంత్ రెడ్డి

image

సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు.

News December 26, 2024

సీఎంతో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరం

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి హాజరుకాలేదు. సినీ పెద్దలంతా కలిసి వస్తారని భావించినా సీనియర్ హీరోల్లో కేవలం నాగార్జున, వెంకటేశ్ మాత్రమే కనిపించారు. చెన్నైలో స్నేహితుడి కూతురి పెళ్లికి వెళ్లడం వల్లే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు చిరు టీం తెలిపింది. హీరోల్లో వరుణ్ తేజ్, శివ బాలాజీ, కళ్యాణ్ రామ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, రామ్, సిద్ధూ జొన్నలగడ్డ, నితిన్, సాయిధరమ్ తేజ్ వచ్చారు.

News December 26, 2024

సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో దిల్ రాజు నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇతర అంశాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.