News May 10, 2024
లార్డ్స్ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం పెంపు

అత్యంత పురాతనమైన లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్‌లోని లార్డ్స్ స్టేడియం సరికొత్త హంగులతో అందుబాటులోకి రానుంది. ఈ గ్రౌండ్ సీటింగ్ సామర్థ్యాన్ని మరో 1100 సీట్లకు పెంచేందుకు మెరైల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)కు చెందిన 18000 మంది ఆమోదించారు. 61.8 మిలియన్ పౌండ్ల ప్రాజెక్టులో భాగంగా 1930లో నిర్మించిన టావెర్న్ & అలెన్ స్టాండ్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం లార్డ్స్‌లో 31,180 సీటింగ్ కెపాసిటీ ఉంది.
Similar News
News March 10, 2026
ఇలా చేస్తే గ్యాస్ ఆదా అవుతుంది!

గ్యాస్ ఆదా చేయడానికి కొన్ని చిట్కాలు. పప్పు, బియ్యాన్ని ఓ అరగంట నానబెడితే త్వరగా ఉడుకుతాయి. ప్రెషర్ కుక్కర్ & పెద్ద పాత్రలు వాడండి. గిన్నెపై మూత పెట్టండి. ఆవిరి రూపంలో గ్యాస్ వృథా కాకుండా సిమ్‌లో పెట్టండి. వంటకు అవసరమైన నీరే పోయండి. తరచూ బర్నర్లను క్లీన్ చేయండి. ఫ్రిజ్‌లో ఉంచిన వాటిని వెంటనే వేడి చేయొద్దు. ఒకేసారి రెండు పూటలకు సరిపడా వంట చేసుకోండి. వంట పూర్తయ్యే 2 ని.ల ముందే ఆఫ్ చేసి మూతపెట్టండి.
News March 10, 2026
ప్రభాకర్‌రావుకు రెగ్యులర్ బెయిల్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న SIB మాజీ చీఫ్ ప్రభాకరరావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణకు సహకరించాలంది. అలాగే సాక్షులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేయొద్దని, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
News March 10, 2026
VIRAL PHOTO: ‘ఫిట్’ మ్యాన్

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా వెకేషన్‌లో ఉన్న ఆయన షర్ట్ లెస్ ఫొటోను షేర్ చేయగా వైరలవుతోంది. సిక్స్ ప్యాక్ కోసం హిట్ మ్యాన్ ప్రయత్నిస్తున్నారని, బాడీ చూస్తేనే అర్థమవుతోందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే అదిరిపోయే ఫిట్‌నెస్ సాధించారని ప్రశంసిస్తున్నారు. కాగా ఈనెల చివర్లో IPL-2026 ప్రారంభంకానుంది.


