News May 11, 2024

కోల్‌కతాను ముంబై నిలువరించేనా?

image

ఐపీఎల్‌లో ఇవాళ కోల్‌కతాతో ముంబై తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. KKR వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచింది. దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. మరోవైపు ముంబై ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఇప్పటివరకు ఆ జట్టు 12 మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

Similar News

News November 6, 2025

పరకామణి కేసుపై సమగ్ర దర్యాప్తు: రవిశంకర్

image

AP: తిరుమలలో పరకామణి <<18117294>>చోరీ కేసుపై<<>> హైకోర్టు ఆదేశాలతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని CID DG రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. ఇప్పటికే పరకామణి భవనం, CCTV కమాండ్ కంట్రోల్ సెంటర్‌, చోరీ దృశ్యాలను పరిశీలించామన్నారు. నిందితుడు రవికుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, HYD, తిరుపతిలో ఆస్తులున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసుపై DEC 2న హైకోర్టుకు నివేదిస్తామని తెలిపారు.

News November 6, 2025

ఆ కప్పు టీకి భారీ మూల్యం: పాక్ Dy. PM

image

తాలిబన్స్‌తో ఓ టీ మీట్‌తో భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాక్ Dy.PM ఇషాక్ దార్ అన్నారు. 2021లో తాలిబన్లు అధికారం పొందాక ISI మాజీ చీఫ్ హమీద్ ఆ దేశంలో పర్యటించి వారితో టీ తాగుతూ అంతా బాగుంటుందని భరోసా ఇచ్చారని విమర్శించారు. దీంతోనే PAK-AFG బార్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబన్స్ పాక్‌లోకి వచ్చారన్నారు. వారితో పాక్‌లోని మిలిటెంట్ గ్రూప్స్ రీ యాక్టివేట్ అయి తమపై బుసకొడుతున్నాయని వాపోయారు.

News November 6, 2025

బెట్టింగ్ యాప్ కేసు.. రైనా, ధవన్ ఆస్తులు అటాచ్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇలాంటి యాప్‌లకు ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వారిద్దరినీ అధికారులు విచారించారు.