News May 11, 2024

శుభ్‌మన్ గిల్ మరో రికార్డు

image

GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో మరో ఘనత సాధించారు. తక్కువ మ్యాచుల్లో (103) నాలుగు సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఏడు సెంచరీలతో బట్లర్ 2వ, ఆరు శతకాలతో క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్, షేన్ వాట్సన్, KL రాహుల్, డేవిడ్ వార్నర్ తలో నాలుగు సెంచరీలతో ఉన్నారు.

Similar News

News February 11, 2026

‘మౌంటెడ్ స్ప్రేయర్’తో ఎరువుల పిచికారీ సులభం

image

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరికరాలు సాగులో రైతు శ్రమను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది రైతులు ‘మౌంటెడ్ స్ప్రేయర్’ అనే పరికరాన్ని వాడుతున్నారు. దీన్ని ట్రాక్టరుకు బిగించి ద్రవరూపంలో ఎరువులను పిచికారీ చేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రోజుకు 20 ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు. దీన్ని వాడటం వల్ల కూలీల కొరతను అధిగమించడంతో పాటు మొక్కలకు కూడా సమపాళ్లలో ఎరువులు, మందులను అందించవచ్చు.

News February 11, 2026

హైదరాబాద్ ECILలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని ECIL 18 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు FEB 20న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PG, PGDM (మెటీరియల్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్), BE/BTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. DV, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.ecil.co.in/

News February 11, 2026

మీ బీరువాలో ఈ వస్తువులు ఉన్నాయా?

image

ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే బీరువాను ఎల్లప్పుడూ దక్షిణ నైరుతి దిశలో ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ‘బీరువాలో తెల్లని వస్త్రం పరచడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. వెండి పాత్రలో వట్టివేరు ఉంచితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తద్వారా ఆర్థిక నష్టాలు తొలగుతాయి. ఈ చిన్న మార్పులు చేయడం వల్ల ఇంట్లో సంపద నిలవడమే కాకుండా నిత్యం సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి’ అని సూచిస్తున్నారు.