News May 11, 2024
శుభ్‌మన్ గిల్ మరో రికార్డు

GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో మరో ఘనత సాధించారు. తక్కువ మ్యాచుల్లో (103) నాలుగు సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఏడు సెంచరీలతో బట్లర్ 2వ, ఆరు శతకాలతో క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్, షేన్ వాట్సన్, KL రాహుల్, డేవిడ్ వార్నర్ తలో నాలుగు సెంచరీలతో ఉన్నారు.
Similar News
News February 9, 2026
స్కాములతో రేవంత్ చరిత్రలో నిలిచిపోతారు: హరీశ్

TG: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులో ఉందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను BRS MLA హరీశ్ రావు ఖండించారు. తమ పొత్తు ప్రజలతోనేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఏనాడూ బీజేపీతో కలవలేదన్నారు. సిద్దిపేటలో మాట్లాడుతూ ‘ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ సంక్షేమ పథకాలతో చరిత్రలో నిలిచిపోయారు. రేవంత్ రెడ్డి మాత్రం స్కాములతో చరిత్రలో నిలిపోతారు’ అని విమర్శించారు.
News February 9, 2026
NCERTలో 117 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

<
News February 9, 2026
BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,240 పెరిగి రూ.1,58,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,050 ఎగసి రూ.1,45,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది.


