News May 11, 2024
TSRTC: ఆ ఉద్యోగులు టీషర్ట్, జీన్స్ వేసుకోవద్దు!

TG: ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో జీన్స్, టీ షర్టులు వేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫామ్ ధరిస్తున్నారు. మిగతా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేకపోవడంతో క్యాజువల్స్‌లోనే కార్పొరేషన్, డిపోలకు వస్తున్నారు. ఈక్రమంలో అందరూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మల్స్, యూనిఫామ్‌లో రావాలని ఎండీ సూచించారు.
Similar News
News February 5, 2026
పశువుల పాలను సేకరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పశువుల పాలను తీసే సమయంలో డెయిరీఫామ్ నిర్వహించేవారు, పాడి రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఒకే సమయానికి పాలను సేకరించాలని, పొదుగు నుంచి పాలను పూర్తిగా తీయకుండా వదిలేయడం మంచిది కాదంటున్నారు. మిల్క్ సేకరించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలకు మంచి ధర ఎప్పుడు లభిస్తుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 5, 2026
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు

<
News February 5, 2026
పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.


