News May 11, 2024
TSRTC: ఆ ఉద్యోగులు టీషర్ట్, జీన్స్ వేసుకోవద్దు!

TG: ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో జీన్స్, టీ షర్టులు వేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫామ్ ధరిస్తున్నారు. మిగతా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేకపోవడంతో క్యాజువల్స్‌లోనే కార్పొరేషన్, డిపోలకు వస్తున్నారు. ఈక్రమంలో అందరూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మల్స్, యూనిఫామ్‌లో రావాలని ఎండీ సూచించారు.
Similar News
News February 19, 2025
ఉద్యోగం వదిలేసి వ్యాపారం.. CM చంద్రబాబు ప్రశంసలు

ఇంజినీర్ ఉద్యోగం వదిలి మిల్లెట్ వ్యాపారం చేస్తున్న బొర్రా శ్రీనివాస రావును CM చంద్రబాబు ప్రశంసించారు. యువతకు స్ఫూర్తినిస్తున్న ఆయన్ను త్వరలో కలుస్తానన్నారు. ‘మన్యం గ్రెయిన్స్’ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీని ప్రారంభించి 400-500 మంది రైతులకు సాధికారత కల్పించారని పేర్కొన్నారు. వారి ఆదాయం 20-30% పెరిగేలా చేశారని తెలిపారు. 2018లో అనకాపల్లిలో నెలకొల్పిన ఈ సంస్థ ఆదాయం 2023-24లో ₹1cr+కి చేరింది.
News February 19, 2025
ఆన్‌లైన్ డేటింగ్.. రూ.4.3 కోట్లు మోసపోయిన మహిళ

ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చెందిన అన్నెట్ ఫోర్డ్ (57) అనే మహిళ ఆన్‌లైన్ డేటింగ్‌లో రూ.4.3 కోట్లు మోసపోయారు. భర్తకు దూరమైన అన్నెట్ నిజమైన ప్రేమ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ‘ప్లెంటీ ఆఫ్ ఫిష్’ అనే డేటింగ్ సైట్‌లో విలియం అనే వ్యక్తితో పరిచయమై రూ.1.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. ఆ తర్వాత FBలో పరిచయమైన నెల్సన్ అనే వ్యక్తి మరో రూ.కోటిన్నర తీసుకున్నాడు. మరో మహిళకు రూ.98.5 లక్షలు ఇచ్చి మోసపోయారు.
News February 19, 2025
ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ

ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కేంద్ర పరిశీలకులు భేటీ అయ్యారు. కాసేపట్లో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.