News May 11, 2024
ముగిసిన ప్రచార పర్వం.. మూగబోయిన మైకులు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 నెలలుగా ప్రచారంలో హోరెత్తించిన మైకులు, DJలు, నేతల గళాలు మూగబోయాయి. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో సా.4 గంటలకే బంద్ కాగా.. మిగతా చోట్ల ఈ సా.6 గంటలకు ప్రచారం ముగిసింది. ఇన్నాళ్లూ ఇంటింటికీ తిరిగి అభ్యర్థులు హామీల వర్షం కురిపించగా.. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. జూన్ 4న ఓటర్ల నాడి ఏంటన్నది ఫలితాల్లో తేలనుంది.
Similar News
News March 22, 2026
అమెరికా దాడుల్లో 20 రోజుల పాప మృతి!

అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌లోని ఖజ్విన్‌కు చెందిన 20 రోజుల పాప చనిపోయినట్లు ఇరానియన్ మీడియా సంస్థ ‘ఫార్స్ న్యూస్’ పేర్కొంది. US-అమెరికా దాడులు ప్రారంభించినప్పటి (ఫిబ్రవరి 28) నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో 1,400కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇందులో 200 మందికి పైగా పిల్లలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. యుద్ధంలో పసి ప్రాణాలు బలవ్వడం బాధాకరమని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.
News March 22, 2026
కొండచిలువల రక్తంలో బరువును తగ్గించే మాలిక్యూల్

బర్మీస్ కొండచిలువలు తమ శరీర బరువుకు సమానమైన ఆహారాన్ని తినగలవు. ఆ తర్వాత నెలలపాటు తిండి లేకుండా ఉండగలవు. ఇలాంటి అసాధారణ జీవక్రియకు వాటి రక్తంలోని pTOS మాలిక్యూల్ కారణమని స్టాన్‌ఫోర్డ్(US) సైంటిస్టులు గుర్తించారు. దీన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లలో వాడొచ్చని, ఊబకాయంపై పోరాటంలో ఇదొక కీలక మలుపు అని పేర్కొన్నారు. pTOSను ఎలుకలకు ఇవ్వగా అవి తక్కువ ఆహారం తిని 28 రోజుల్లోనే 9% బరువు తగ్గాయన్నారు.
News March 22, 2026
లక్ష్యాన్ని మించి రబీ సాగు!

AP: మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసినా రబీ సాగుకు ఆటంకం కలగలేదు. ఈ సీజన్‌లో 20.79L హెక్టార్లలో 22 పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఏకంగా 27.36L హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, అపరాలు, చిరు ధాన్యాలు, పొగాకు, నూనె గింజలను సాగు చేశారు. కృష్ణా, గోదావరి డెల్టాలతోపాటు నదులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతోనే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.


