News May 11, 2024
ముగిసిన ప్రచార పర్వం.. మూగబోయిన మైకులు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 నెలలుగా ప్రచారంలో హోరెత్తించిన మైకులు, DJలు, నేతల గళాలు మూగబోయాయి. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో సా.4 గంటలకే బంద్ కాగా.. మిగతా చోట్ల ఈ సా.6 గంటలకు ప్రచారం ముగిసింది. ఇన్నాళ్లూ ఇంటింటికీ తిరిగి అభ్యర్థులు హామీల వర్షం కురిపించగా.. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. జూన్ 4న ఓటర్ల నాడి ఏంటన్నది ఫలితాల్లో తేలనుంది.
Similar News
News January 25, 2026
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఈ జాగ్రత్తలు

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. క్లోరిన్ కలిపిన నీటిలో స్విమ్ చేసే ముందు మంచినీళ్లతో తలస్నానం చేసి క్యాప్ పెట్టుకోవాలి. స్విమ్మింగ్ తర్వాత మంచి నీళ్లతో తలస్నానం చేయాలి. ఎండలోకి వెళ్లే ప్రతిసారీ సన్‌స్ర్కీన్ హెయిర్ స్ర్పే వాడాలి. తలకు మరీ వేడి/ చల్లని గాలి తరచూ తగలకుండా స్కార్ఫ్/ క్యాప్ పెట్టుకోవాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
News January 25, 2026
ఇవాళ నాన్ వెజ్ తినకండి! ఎందుకంటే..

వారంలో కొన్ని రోజులు కొందరు దేవుళ్ల పేరిట నియమాలు పాటించి సండే ఏ రూల్ పెట్టుకోం. కానీ లోకానికి వెలుగునిచ్చే ఆదిత్యుడి రోజైన ఆదివారం మాంసం జోలికి పోకూడదట. సూర్యాష్టక శ్లోకం ‘స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్దినే| న వ్యాధి శోక దారిద్య్రం సూర్యలోక స గచ్ఛతి’ ప్రకారం.. ఆదివారం స్త్రీ సాంగత్యం, తల నూనె, మద్యం, మాంసం తాకలేదంటే దారిద్ర్య విముక్తి, సూర్యలోక ప్రాప్తి. ఈరోజు సూర్య జయంతి-రథ సప్తమి.
News January 25, 2026
పశువుల్లో పాల ఉత్పత్తిని మరింత పెంచే గడ్డి

పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు చాలా మంది పాడి రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసం వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్’ పశుగ్రాసం అందుబాటులోకి వచ్చింది. నేపియర్‌తో పోలిస్తే ఇది చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. దీన్ని ఎలా సాగు చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


