News May 11, 2024

బయటి ప్రాంతాల వారు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలి: సీఈవో ముకేశ్

image

AP: సా.6 గంటల తర్వాత అన్నిరకాల ప్రచారం ఆగిపోవాల్సిందేనని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. బయటి ప్రాంతాల వారు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. రేపు సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ బూత్‌లకు చేరుకుంటారని తెలిపారు. ఎల్లుండి ఉ.7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.

Similar News

News March 6, 2026

కేజీ వెండిపై రూ.5వేలు తగ్గుదల

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో <<19309772>>బంగారం<<>>తో పాటు ఇవాళ వెండి ధర తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,90,000 పలుకుతోంది. గత 6 రోజుల్లో కేజీ వెండిపై రూ.35వేలు తగ్గుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 6, 2026

తనూజ, దివ్వెల మాధురిపై పోలీసులకు ఫిర్యాదు

image

AP: తిరుమలలో <<19305826>>దివ్వెల మాధురి<<>>, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడంపై TTD స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరుపుకున్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల గెస్ట్ హౌస్‌లలో ఇలాంటి వేడుకలు నిషేధమని వెల్లడించింది. వీడియోలు తీసి SMలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఇక ఈ ఘటనపై TTD విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 6, 2026

పెట్రోల్ ధరలు పెరుగుతాయా?.. కేంద్ర వర్గాలు ఏం చెప్పాయంటే..

image

దేశంలో పెట్రోల్ ధరలు పెరగవని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ‘రష్యా నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తున్నాం. ముడి చమురు విషయంలో పరిస్థితి అదుపులోనే ఉంది. దేశీయ మార్కెట్లలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగవు’ అని వివరించాయి. హార్ముజ్ జలసంధి గుండా గ్యాస్, ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తగినంత మేర రిజర్వులు ఉన్నాయని వెల్లడించాయి.