News May 11, 2024

బయటి ప్రాంతాల వారు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలి: సీఈవో ముకేశ్

image

AP: సా.6 గంటల తర్వాత అన్నిరకాల ప్రచారం ఆగిపోవాల్సిందేనని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. బయటి ప్రాంతాల వారు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. రేపు సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ బూత్‌లకు చేరుకుంటారని తెలిపారు. ఎల్లుండి ఉ.7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.

Similar News

News February 11, 2025

మద్యం ధరల పెంపుతో రూ.150 కోట్ల ఆదాయం: కొల్లు

image

AP: YCP హయాంలో నకిలీ బ్రాండ్లతో మద్యం విక్రయాలు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మద్యం డిపోలను తాకట్టుపెట్టి తెచ్చిన అప్పుల్లో ₹12K కోట్లు తాము చెల్లించామన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా లిక్కర్ విక్రయాలు చేస్తున్నామని తెలిపారు. బాటిల్‌పై రేటు ₹10 పెంచామని, దీనివల్ల ప్రభుత్వానికి ₹150 కోట్ల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. త్వరలో నవోదయం కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామన్నారు.

News February 11, 2025

మన్యం బంద్ నిర్ణయం వెనక్కి

image

AP: స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా చేపడుతున్న మన్యం బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 1/70 చట్టం అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన <<15427067>>హామీ<<>> ఇవ్వడంతో రేపు నిర్వహించతలపెట్టిన బంద్‌ను రద్దు చేస్తున్నట్లు నేతలు తెలిపారు.

News February 11, 2025

EVMల్లో డేటా డిలీట్ చేయొద్దు: సుప్రీంకోర్టు

image

EVMల్లో సింబల్ లోడింగ్ యూనిట్లు, మెమరీ తొలగింపు ప్రక్రియను వెరిఫై చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలన్న ADR పిటిషన్‌కు బదులివ్వాలని ECIని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనిఖీ జరిగేటప్పుడు EVMల్లో డేటాను చెరిపేయొద్దని లేదా రీలోడ్ చేయొద్దని సూచించింది. ‘ఎన్నికల తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే మెమరీ తొలగింపు లేదా మైక్రోచిప్‌ ట్యాంపర్ అవ్వలేదని ఇంజినీర్లు ధ్రువీకరించేందుకు వెరిఫికేషన్‌‌ను కోరుకుంటున్నాం’ అని తెలిపింది.

error: Content is protected !!