News May 11, 2024
144 సెక్షన్ షురూ

దేశంలో నాలుగో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. బల్క్ SMSలు సైతం పంపించవద్దని ఈసీ సూచించింది. నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండవద్దని ఆదేశించింది. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు రానుండగా.. జూన్ 1 సాయంత్రం 6.30గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుందని తెలిపింది. సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు ఉంటాయని పేర్కొంది.
Similar News
News February 8, 2026
మేడారం ప్రసాదం బుకింగ్స్‌లో కరీంనగర్ రీజియన్ టాప్

మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రసాద బుకింగ్‌లో కరీంనగర్ రీజియన్ తొలి స్థానం దక్కించుకుందని కార్గో మేనేజర్ వెంకటనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 17న ప్రారంభమైన బుకింగ్ ఫిబ్రవరి 5తో ముగిసింది. రూ.299 చొప్పున జరిగిన బుకింగ్‌లో 211 నమోదై రూ.63,080 ఆదాయం వచ్చింది. బుక్ చేసిన భక్తులకు బంగారం (బెల్లం), అమ్మవారి ఫొటో, పసుపు, కుంకుమ ప్యాకెట్లు త్వరలో అందజేస్తామని ఆయన తెలిపారు.
News February 8, 2026
మున్సి‘పోల్స్’: వలస ఓటర్లకు ఫ్లైట్ టికెట్లు.. ముంబై వెళ్లి ప్రచారం

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వినూత్న మార్గాలు ఎంచుకుంటున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడ, తాళ్లసింగారం, లింగారెడ్డి గూడెం, తంగడపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ఓటర్లు ఉపాధి కోసం ముంబైకి వెళ్లారు. వారిని రప్పించేందుకు విమానం, రైలు, బస్సు ఖర్చులు భరిస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు స్వయంగా ముంబైకి వెళ్లి ప్రచారం కూడా చేశారు.
News February 8, 2026
నింగిలో నిఘా: శత్రు ఉపగ్రహాలపై భారత్ సరికొత్త ‘స్నూపింగ్’!

అహ్మదాబాద్‌కు చెందిన ‘అజిస్తా’ సంస్థ కక్ష్యలో ఉన్న ఇతర ఉపగ్రహాలను ఫొటోలు తీసే (In-orbit imaging) సామర్థ్యాన్ని నిరూపించింది. ఇండియన్ టెక్నాలజీతో తయారైన AFR శాటిలైట్.. వేగంగా కదులుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని స్పష్టంగా ఫొటోల్లో బంధించింది. శత్రువుల కదలికలను పసిగట్టడానికి, అంతరిక్ష ఆస్తులను రక్షించుకోవడానికి, క్షిపణులను ట్రాక్ చేయడానికి ఈ ‘స్పేస్ స్నూపింగ్’ భారత్‌కు కీలకం కానుంది.


