News May 11, 2024
మోదీ తర్వాతి టార్గెట్ యోగి: కేజ్రీవాల్

ప్రధాని మోదీ చాలామంది నేతల రాజకీయ జీవితాలకు ముగింపు పలికారని ఢిల్లీ CM కేజ్రీవాల్ ఆరోపించారు. LK.అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, సుమిత్రా మహాజన్, శివరాజ్‌సింగ్ చౌహాన్ విషయాల్లో చేసినట్లే UP CM యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితానికీ మోదీ ముగింపు చెబుతారని జోస్యం చెప్పారు. మోదీ తర్వాతి టార్గెట్ యోగినే అని కేజ్రీవాల్ అన్నారు. ఈసారి BJP గెలిస్తే 2నెలల్లో యోగిని భర్తీ చేస్తారని తాను రాసిస్తానని సవాల్ చేశారు.
Similar News
News March 12, 2025
పాకిస్థాన్ క్రికెట్ ICUలో ఉంది: అఫ్రీది

సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పాకిస్థాన్ క్రికెట్ ఇప్పుడు ICUలో ఉందని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘PCB నిర్ణయాల్లో కంటిన్యుటీ, కన్సిస్టెన్సీ ఉండట్లేదు. తరచుగా కెప్టెన్, కోచ్‌లను మారుస్తున్నారు. కోచ్‌లు ప్లేయర్లను నిందించడం, మేనేజ్‌మెంట్ స్టాఫ్ తమ పదవుల్ని కాపాడుకునేందుకు కోచ్‌లు, ఆటగాళ్లను నిందించడం విచారకరం’ అని బోర్డు పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
News March 12, 2025
వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
News March 12, 2025
ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్

AP: ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వేతన బకాయిలను మరో 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు వివరించింది. అలాగే, మెటీరియల్ నిధులతో చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులనూ 10 రోజుల్లో చెల్లిస్తామంది. ఈ రెండింటికీ సంబంధించి రూ.2వేల కోట్ల బకాయిలు ఉండటంతో రాష్ట్ర ఉన్నతాధికారి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఉన్నతాధికారులను కలిశారు. దీంతో సానుకూలంగా స్పందించిన వారు నిధులు విడుదల చేస్తామని చెప్పారు.