News May 11, 2024

సీకే నాయుడు ట్రోఫీలో ఇకపై నో టాస్!

image

దేశవాళీ క్రికెట్‌లో పలు కీలక మార్పులను BCCI కార్యదర్శి జైషా ప్రతిపాదించారు. ఇకపై U-23 సీకే నాయుడు ట్రోఫీలో టాస్ విధానానికి స్వస్తి పలకనున్నారు. విజిటింగ్ టీమ్ బ్యాట్ లేదా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇది సక్సెస్ అయితే రంజీ ట్రోఫీలోనూ ప్రవేశపెడతారని సమాచారం. ఫస్ట్ ఇన్నింగ్సులో బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనను బట్టి పాయింట్లు కేటాయిస్తారట. త్వరలోనే పూర్తి విధివిధానాలు ఖరారవుతాయని తెలుస్తోంది.

Similar News

News September 18, 2025

ఈసీఐఎల్‌లో 160 ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని <>ECIL<<>> 160 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్‌లో కనీసం 60% మార్కులతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

News September 18, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

APలోని రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలోని HYDలో సాయంత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.

News September 18, 2025

‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

image

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?