News May 11, 2024
సీకే నాయుడు ట్రోఫీలో ఇకపై నో టాస్!

దేశవాళీ క్రికెట్‌లో పలు కీలక మార్పులను BCCI కార్యదర్శి జైషా ప్రతిపాదించారు. ఇకపై U-23 సీకే నాయుడు ట్రోఫీలో టాస్ విధానానికి స్వస్తి పలకనున్నారు. విజిటింగ్ టీమ్ బ్యాట్ లేదా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇది సక్సెస్ అయితే రంజీ ట్రోఫీలోనూ ప్రవేశపెడతారని సమాచారం. ఫస్ట్ ఇన్నింగ్సులో బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనను బట్టి పాయింట్లు కేటాయిస్తారట. త్వరలోనే పూర్తి విధివిధానాలు ఖరారవుతాయని తెలుస్తోంది.
Similar News
News January 25, 2026
బడ్జెట్ సమావేశాల్లో జమిలి, అమరావతి బిల్లులు!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ‘జమిలి ఎన్నికల’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే JPC నివేదిక సిద్ధమైంది. అమరావతిని AP రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుతో పాటు, ‘పూర్వోదయ’ పథకం కింద రాష్ట్రానికి భారీ నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను సరళీకరణ, వక్ఫ్ బోర్డు సవరణలు, ‘వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్ బిల్లు’ కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
News January 25, 2026
నేపియర్ కంటే 4G బుల్లెట్ సూపర్ నేపియర్ ఎందుకు ప్రత్యేకం?

నేపియర్ గడ్డి ముదిరితే కాండం కాస్త గట్టిగా ఉంటుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్ కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండి, పాడి పశువు తినడానికి సులువుగా ఉంటుంది. నేపియర్‌తో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి చాలా గుబురుగా పెరుగుతుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్‌లో ప్రొటీన్ కంటెంట్, దిగుబడి, మొక్కలు పెరిగే ఎత్తు, మొక్క ఆకుల్లోని మృదుత్వం.. సాధారణ నేపియర్ గడ్డి కంటే ఎక్కువగా ఉంటుంది.
News January 25, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది. నిన్న రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. అటు పలు చోట్ల చలి తీవ్రత కొనసాగుతోంది.


