News May 12, 2024
‘ఎన్ని’కల కష్టాలో
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు కుటుంబాలతో వెళ్తున్న వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు రద్దీకి తగ్గట్లు బస్సులు లేక నిరీక్షించి నిరసించిపోతున్నారు. గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RTCలు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అవి కనిపించడం లేదు. ఇసుకేస్తే రాలనంత జనంతో బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
Similar News
News December 27, 2024
బేబీ హిప్పోకు భారీ విరాళం!
ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన థాయిలాండ్‌కు చెందిన బేబీ హిప్పో ‘మూ డెంగ్’కు జాక్ పాట్ లభించింది. ఖావో ఖీవో జూలో ఉండే ఈ హిప్పో సంరక్షణకు Ethereum సహ-వ్యవస్థాపకుడు $290,000 (సుమారు రూ. 2.51 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ 5 నెలల పిగ్మీ హిప్పో కోసం భారీ క్రిస్మస్ కానుక అందించినట్లు తెలిపారు. గత నెలలో ఆయన జూను సందర్శించినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
News December 27, 2024
‘పుష్ప-2’ సినిమా కలెక్షన్లు ఎంతంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం 22 రోజుల్లోనే రూ.1719.5 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. 2024లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ‘పుష్ప-2’ అని పోస్టర్ రిలీజ్ చేశారు. వీకెండ్‌తో పాటు న్యూ ఇయర్ సెలవులతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
News December 27, 2024
మన్మోహన్ సహకారం మరువలేనిది: KCR
TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల BRS అధినేత KCR సంతాపం తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు మన్మోహన్ అందించిన సహకారం మరువలేనిదని కొనియాడారు. ‘తెలంగాణ కోసం పోరాడిన ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారు. ఆయన ప్రధానిగా ఉండగానే రాష్ట్రం ఏర్పడింది. మన్మోహన్‌కు ఘన నివాళులు’ అని KCR పేర్కొన్నారు. అటు రేపు జరిగే ఆయన అంత్యక్రియల్లో పాల్గొనాలని KTR సహా పార్టీ నేతలను KCR ఆదేశించారు.