News May 12, 2024

మొదటి ఓటు పార్లమెంట్ అభ్యర్థికి, రెండోది అసెంబ్లీ అభ్యర్థికి

image

AP ఎన్నికల్లో ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి అసెంబ్లీకి అయితే, మరొకటి పార్లమెంట్‌కి. ముందుగా పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాలి. ఆ తర్వాతే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థికి ఓటు వేయాలి. ఈ రెండు బ్యాలట్ యూనిట్లు వేర్వేరుగా ఉంటాయి. అటూ ఇటూ కాకుండా.. పోటీ చేసే అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తు చూసి EVMలపై బటన్లు నొక్కండి.
☞ మీ భవిష్యత్తును మార్చే అభ్యర్థిని ఎన్నుకోండి.

Similar News

News March 16, 2026

INDలో ప్రతి నలుగురిలో ఒకరికి ‘మైగ్రేన్’!

image

మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదని, ఇది తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య అని వైద్యులు పేర్కొన్నారు. ‘ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరు దీనితో బాధపడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితోపాటు వాంతులు, వెలుతురును చూడలేకపోవడం వంటివి కనిపిస్తాయి. ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల వల్ల ఇది పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ, సరైన చికిత్సతో దీనిని తగ్గించవచ్చు’ అని సూచిస్తున్నారు.

News March 16, 2026

FLASH: తగ్గిన బంగారం ధర

image

బంగారం ధర క్రమంగా దిగొస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.490 తగ్గి రూ.1,59,170కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పతనమై రూ.1,45,900 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 16, 2026

గంట మోగించేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు

image

ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మాత్రమే గంట కొట్టాలి. తిరిగి వచ్చేటప్పుడు కొట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను ఎడమ చేతితో పట్టుకుని లయబద్ధంగా మోగించాలి. అనవసరంగా, పదేపదే కొట్టకూడదు. 2,3 సార్లు స్పష్టంగా మోగించడం శ్రేయస్కరం. రాత్రి సమయాల్లో గంటను బిగ్గరగా మోగించకూడదు. ఈ నియమాలను పాటిస్తే దేవతల ఆవాహన జరగడమే కాకుండా, ఆ ప్రతిధ్వని ద్వారా మనసు ఏకాగ్రతను పొంది ఇంట్లో సానుకూల ప్రకంపనలు వ్యాపిస్తాయి.