News May 12, 2024

మొదటి ఓటు పార్లమెంట్ అభ్యర్థికి, రెండోది అసెంబ్లీ అభ్యర్థికి

image

AP ఎన్నికల్లో ఓటర్లు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి అసెంబ్లీకి అయితే, మరొకటి పార్లమెంట్‌కి. ముందుగా పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేయాలి. ఆ తర్వాతే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థికి ఓటు వేయాలి. ఈ రెండు బ్యాలట్ యూనిట్లు వేర్వేరుగా ఉంటాయి. అటూ ఇటూ కాకుండా.. పోటీ చేసే అభ్యర్థి పేరు, ఫొటో, గుర్తు చూసి EVMలపై బటన్లు నొక్కండి.
☞ మీ భవిష్యత్తును మార్చే అభ్యర్థిని ఎన్నుకోండి.

Similar News

News January 19, 2026

రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 31 ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://skltghu.ac.in/

News January 19, 2026

ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 14న పోలింగ్?

image

TG: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 21న షెడ్యూల్, ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అటు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మరి ‘ప్రేమికుల రోజు’ ఓటర్లు ఎవరిపై ప్రేమ కురిపిస్తారో చూడాలి.

News January 19, 2026

FEB 9న AP మెడికల్ కౌన్సిల్ ఎన్నిక

image

AP మెడికల్ కౌన్సిల్ ఎన్నిక FEB 9న జరగనుంది. ఈనెల 27వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ‘మండలిలో సభ్యత్వం కలిగిన 55,504 మంది వైద్యుల్లో రాష్ట్రంలో ఐదేళ్లకు పైబడి ఉంటున్న వారు పోటీకి అర్హులు. సభ్యులు ఎక్కడ్నుంచైనా ఆన్‌లైన్, మొబైల్ ద్వారా ఓటు వేయొచ్చు. దీనికోసం APMC ఆన్‌లైన్ ఎలక్షన్ పోర్టల్‌లో లాగిన్ కావాలి’ అని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు వెల్లడించారు. కాగా APMCకి 13 మందిని ఎన్నుకుంటారు.