News May 12, 2024
పోలింగ్ బూత్‌లో ఏం చేయాలంటే?

☞ ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డుతో ప్రవేశించాలి
☞ జాబితాలో పేరుంటే ఓటేసేందుకు అనుమతి ఇస్తారు
☞ ఆ తర్వాత ఎడమచేతి చూపుడు వేలిపై ఇంకు పూస్తారు
☞ ఆ తర్వాత పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసే ఛాంబర్‌కు వెళ్లాలి
☞ అప్పుడు పోలింగ్ అధికారి బ్యాలట్‌ను రిలీజ్ చేస్తారు. అక్కడ ఓటు వేశాక రెండో ఛాంబర్‌లో అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేయాలి.
☞☞ నీ ఓటు సమయం 5 నిమిషాలే.. దాని విలువ 5 ఏళ్లు.
Similar News
News September 17, 2025
విలీనం కాకపోతే TG మరో పాక్‌లా మారేది: బండి

TG: సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘భారత్‌లో TG విలీనం కాకుంటే మరో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లా ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది. జలియన్ వాలాబాగ్‌ను మించి పరకాల, బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపాతం సృష్టించారు. ఈ దురాగతాలను చరిత్రకారులు విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలను నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.
News September 17, 2025
వేగంలో రారాజు.. మెట్లు ఎక్కడానికి ఆయాస పడుతున్నారు!

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా పేరొందిన ఒలింపిక్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఇప్పుడు ఫిట్‌నెస్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మెట్లు ఎక్కడానికి కూడా ఆయాస పడుతున్నట్లు ఆయన తెలిపారు. అందుకే తన శ్వాసను మెరుగుపరచుకోవడానికి మళ్లీ పరిగెత్తడం ప్రారంభిస్తానని ఆయన పేర్కొన్నారు. 2017లో రిటైర్ అయినప్పటి నుంచీ వ్యాయామం చేయకుండా సినిమాలు చూస్తూ పిల్లలతో గడుపుతున్నానని చెప్పారు.
News September 17, 2025
NVS రెడ్డి విషయంలో ప్రభుత్వం ఏమంటోంది..?

NVS రెడ్డిని HMRL MD పదవి నుంచి తప్పించారనే వాదనను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. ప్రభుత్వ సలహాదారు (అర్బన్ ట్రాన్స్‌పోర్ట్)గా ఆయన సేవలు ఎక్కువ వినియోగించుకునేలా ప్రమోట్ చేసిందని చెబుతున్నాయి. గతంలో GHMC ట్రాఫిక్ కమిషనర్ లాంటి బాధ్యతలతో పట్టణ రవాణాలో NVSకు అపార అనుభవముంది. ఫోర్త్ సిటీపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆయన నైపుణ్యాలు వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపాయి.