News May 12, 2024

పోలింగ్ బూత్‌లో ఏం చేయాలంటే?

image

☞ ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డుతో ప్రవేశించాలి
☞ జాబితాలో పేరుంటే ఓటేసేందుకు అనుమతి ఇస్తారు
☞ ఆ తర్వాత ఎడమచేతి చూపుడు వేలిపై ఇంకు పూస్తారు
☞ ఆ తర్వాత పార్లమెంట్ అభ్యర్థికి ఓటు వేసే ఛాంబర్‌కు వెళ్లాలి
☞ అప్పుడు పోలింగ్ అధికారి బ్యాలట్‌ను రిలీజ్ చేస్తారు. అక్కడ ఓటు వేశాక రెండో ఛాంబర్‌లో అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేయాలి.
☞☞ నీ ఓటు సమయం 5 నిమిషాలే.. దాని విలువ 5 ఏళ్లు.

Similar News

News February 18, 2025

హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్

image

TG: రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను మార్చలేరంటూ హైడ్రాపై హైకోర్టు మరోసారి మండిపడింది. శనివారం విచారణ చేపట్టి, ఆదివారం కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారాంతాల్లో చర్యలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కూల్చివేతలపై హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ హాజరై వివరణ ఇవ్వాలంటూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

News February 18, 2025

అలాంటి ప్లాట్లను కొనుగోలు చేయొద్దు.. హైడ్రా కీలక ప్రకటన

image

TG: వ్యవసాయ భూముల పేరుతో అనధికార లేఅవుట్లలో విక్రయిస్తున్న ప్లాట్లను కొనుగోలు చేయొద్దని ప్రజలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. నిబంధనల ప్రకారం లేఅవుట్ అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఫీజు కట్టాలన్నారు. అయితే కొందరు ఫామ్ ల్యాండ్‌ను ప్లాట్లుగా మార్చుతున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తులు, సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొని ఇళ్లు కడితే కూల్చేస్తామని స్పష్టం చేశారు.

News February 18, 2025

SI పోస్టుల నియామకాలపై కీలక నిర్ణయం

image

AP: పోలీస్ నియామక నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. SI(సివిల్) పోస్టులను 65%(గతంలో 55%) డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని సూచించింది. ప్రమోషన్ ద్వారా 30%, బదిలీల ద్వారా 5% భర్తీ చేయాలంది. గత ఏడాది జులై 1 నుంచి ఏర్పడిన ఖాళీలను ఈ విధానంలో భర్తీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర, కేంద్ర అవార్డులు పొందినవారికి కేటగిరీలను బట్టి 5-25 మార్కులు ఇచ్చి నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంది.

error: Content is protected !!