News May 12, 2024
తన రికార్డును తానే తిరగరాశాడు

ఎవరెస్టు శిఖరాన్ని అత్యధిక సార్లు(28) అధిరోహించిన వ్యక్తిగా నిలిచిన కమీ రీటా తన రికార్డును తానే బ్రేక్ చేశారు. తాజాగా 29వ సారి ఎవరెస్టును అధిరోహించారు. ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. నేపాల్‌కు చెందిన ఈయన తొలిసారిగా 1994, మే 13న ఎవరెస్టును ఎక్కారు. అలాగే ఇప్పటివరకు చోయు శిఖరాన్ని 8 సార్లు, మనస్లూను 3 సార్లు, లోట్సే, K2 రెండింటినీ ఒక్కోసారి అధిరోహించారు.
Similar News
News March 21, 2026
పెట్రోల్ ధరలు పెరుగుతాయా?

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో LPG <<19316911>>గ్యాస్<<>>, పవర్ పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెగ్యులర్ పెట్రోల్ విషయంలో ఆందోళన నెలకొంది. సాధారణ వాహన ఇంధన ధరలను <<19436412>>పెంచబోమని<<>> IOCL ప్రకటించింది. కానీ పలు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయని తెలుస్తోంది. పెట్రోల్‌పై ₹10-15, డీజిల్‌పై ₹10 వరకు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News March 21, 2026
ఉదయాన్నే కాఫీ/టీ తాగితే..

కాఫీ, టీ తాగితే మంచిదా? కాదా? అనే అంశంపై విభిన్న ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా USకు చెందిన హార్వర్డ్, MIT సైంటిస్టులు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఉదయాన్నే కెఫిన్ ఉన్న కాఫీ/టీని మితంగా తీసుకుంటే డిమెన్షియా(మతిమరుపు) ప్రమాదం 18% తగ్గుతుందని పేర్కొన్నారు. స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. 43 ఏళ్లలోపు వయసున్న 1,31,821 మంది డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని తెలిపారు.
News March 21, 2026
తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది: బండి సంజయ్

తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇది ప్రజలను వంచించే బడ్జెట్ అని, అంకెల ఆర్భాటాలు తప్ప ఒరిగేదేమీ లేదని మీడియాతో అన్నారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేశారని ఫైరయ్యారు. ‘డ్రగ్స్ కేసులో సీఎంకు చిత్తశుద్ధి లేదు. ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే’ అని ఆరోపించారు.


