News May 12, 2024
తన రికార్డును తానే తిరగరాశాడు

ఎవరెస్టు శిఖరాన్ని అత్యధిక సార్లు(28) అధిరోహించిన వ్యక్తిగా నిలిచిన కమీ రీటా తన రికార్డును తానే బ్రేక్ చేశారు. తాజాగా 29వ సారి ఎవరెస్టును అధిరోహించారు. ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. నేపాల్‌కు చెందిన ఈయన తొలిసారిగా 1994, మే 13న ఎవరెస్టును ఎక్కారు. అలాగే ఇప్పటివరకు చోయు శిఖరాన్ని 8 సార్లు, మనస్లూను 3 సార్లు, లోట్సే, K2 రెండింటినీ ఒక్కోసారి అధిరోహించారు.
Similar News
News February 18, 2025
ఈకలు లేని కోడిని చూశారా?

AP: సాధారణంగా ఏ కోడికైనా ఈకలు ఉండటం సహజం. అయితే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలో ఈకలు లేని నాటు కోడి ఆశ్చర్యపరుస్తోంది. ఇది పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉందని, దీని వయసు 6 నెలలని యజమాని ఇస్మాయిల్ చెప్పారు. జన్యుపరమైన లోపం కారణంగా ఇలాంటి అరుదైన లక్షణాలు కోళ్లలో ఉంటాయని వైద్యాధికారులు తెలిపారు.
News February 18, 2025
హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్

TG: రాత్రికి రాత్రే హైదరాబాద్‌ను మార్చలేరంటూ హైడ్రాపై హైకోర్టు మరోసారి మండిపడింది. శనివారం విచారణ చేపట్టి, ఆదివారం కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారాంతాల్లో చర్యలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కూల్చివేతలపై హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ హాజరై వివరణ ఇవ్వాలంటూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
News February 18, 2025
అలాంటి ప్లాట్లను కొనుగోలు చేయొద్దు.. హైడ్రా కీలక ప్రకటన

TG: వ్యవసాయ భూముల పేరుతో అనధికార లేఅవుట్లలో విక్రయిస్తున్న ప్లాట్లను కొనుగోలు చేయొద్దని ప్రజలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. నిబంధనల ప్రకారం లేఅవుట్ అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఫీజు కట్టాలన్నారు. అయితే కొందరు ఫామ్ ల్యాండ్‌ను ప్లాట్లుగా మార్చుతున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తులు, సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొని ఇళ్లు కడితే కూల్చేస్తామని స్పష్టం చేశారు.