News May 12, 2024

పవన్ కళ్యాణ్‌పై నాగబాబు కవితాత్మక ట్వీట్

image

జనసేనాని పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నిన్ను నమ్మని వాళ్ల కోసం ఎందుకు నిలబడతావని అడిగితే చెట్టుని చూపిస్తాడు.. అది నాటిన వాళ్లకే నీడనిస్తుందా అని. నీతో నడవని వాళ్ల కోసం ఎందుకు నిందలు మోస్తావని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు.. తనకి మొక్కని రైతు కంటిని తడపకుండా పంటనే తడుపుతుందని. అప్పట్నుంచి అడగటం మానేశా. అతని ఆలోచనా విశాలతని అర్థం చేసుకోవడం మొదలెట్టా’ అని నాగబాబు పోస్ట్ చేశారు.

Similar News

News January 4, 2025

నేడు గోవా, కొచ్చిలో ఫ్రెంచి నేవీ విన్యాసాలు

image

నేడు భారత నేవీతో కలిసి ఫ్రెంచి నేవీ గోవా, కొచ్చి తీరాల్లో విన్యాసాలు చేపట్టనుంది. ఈ సంయుక్త విన్యాసాల ద్వారా ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం చేసుకోవడంతో పాటు ఇండో-పసిఫిక్ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని భారత్, ఫ్రాన్స్ గుర్తుచేయనున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అణు యుద్ధ విమాన వాహక నౌక, ఫ్రిగేట్స్, అణు సబ్‌మెరైన్ సహా ఫ్రెంచి నేవీలోని కీలక రక్షణ ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నాయి.

News January 4, 2025

రోహిత్ సెలక్టర్ల ఫ్యూచర్ ప్లాన్‌లో లేడేమో: గవాస్కర్

image

భారత సెలక్టర్ల ఫ్యూచర్ ప్లాన్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేడేమోనని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. రానున్న రోజుల్లో జట్టులో భారీ మార్పులు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ‘ప్రస్తుతం శర్మ వయసు 37. వచ్చే WTC ఫైనల్ నాటికి 41కి చేరుకుంటారు. ఆ వయసులో ఆయన టెస్టులు ఆడడం అనుమానమే. అందుకే ఆయన స్థానంలో యంగ్ లీడర్‌షిప్‌ను బీసీసీఐ తయారు చేస్తుందేమో’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

News January 4, 2025

ఇజ్రాయెల్‌పైకి గాజా రాకెట్ల దాడి

image

తమపై వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్‌పైకి గాజా యంత్రాంగం రాకెట్లతో ప్రతిదాడి చేసింది. తమ భూభాగం లక్ష్యంగా గాజా వైపునుంచి 3 రాకెట్ల దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది కొనసాగితే తమ దాడుల తీవ్రతను మరింత పెంచుతామని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ తాజా దాడులు 16మంది పాలస్తీనా పౌరుల్ని బలితీసుకున్నాయని గాజా యంత్రాంగం వెల్లడించింది.