News May 12, 2024
పవన్ కళ్యాణ్‌పై నాగబాబు కవితాత్మక ట్వీట్

జనసేనాని పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నిన్ను నమ్మని వాళ్ల కోసం ఎందుకు నిలబడతావని అడిగితే చెట్టుని చూపిస్తాడు.. అది నాటిన వాళ్లకే నీడనిస్తుందా అని. నీతో నడవని వాళ్ల కోసం ఎందుకు నిందలు మోస్తావని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు.. తనకి మొక్కని రైతు కంటిని తడపకుండా పంటనే తడుపుతుందని. అప్పట్నుంచి అడగటం మానేశా. అతని ఆలోచనా విశాలతని అర్థం చేసుకోవడం మొదలెట్టా’ అని నాగబాబు పోస్ట్ చేశారు.
Similar News
News February 18, 2025
సోషల్ మీడియా వాడకంలో వెనుకబడిన ఆ ఎమ్మెల్యేలు?

AP: సోషల్ మీడియా వాడకంలో 65మందికి పైగా TDP ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నట్లు ఆ పార్టీ సమీక్షలో వెల్లడైనట్లు సమాచారం. సమీక్ష ప్రకారం.. ఆయా ఎమ్మెల్యేలు సోషల్ మీడియా వాడకం అంతంతమాత్రంగానే ఉంది. ప్రజల్లోకి వెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు చాలా శక్తిమంతమైనవని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఆ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. దీంతో అధినేత వారికి త్వరలో స్వయంగా క్లాస్ తీసుకుంటారని సమాచారం.
News February 18, 2025
కుంభమేళా పొడిగింపు..? యూపీ సర్కారు జవాబు ఇదే

భక్తుల రద్దీని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మహా కుంభమేళాను మరో రెండు రోజుల పాటు పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలపై యూపీ సర్కారు స్పందించింది. అలాంటి ఆలోచనలేవీ లేవని తేల్చిచెప్పింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల 26న మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని వివరించింది. తాము అధికారికంగా చెబితే తప్ప.. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని సూచించింది.
News February 18, 2025
వచ్చే వారం నుంచే ఎన్టీఆర్-నీల్ సినిమా షూట్?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్’ అన్న వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని సినీ వర్గాల సమాచారం. వికారాబాద్ అడవుల్లో స్టార్ట్ చేయనున్న ఈ తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనరని భోగట్టా. మూవీ కోసం ఆర్ఎఫ్‌సీలో ఇప్పటికే భారీ సెట్ తయారవుతోంది. ఆ సెట్లో జరిగే సెకండ్ షెడ్యూల్‌కు తారక్ వస్తారని తెలుస్తోంది.