News May 12, 2024
పంది కిడ్నీ అమర్చుకున్న వ్యక్తి మృతి

వైద్య చరిత్రలో తొలిసారి జన్యుపరంగా మార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చుకున్న వ్యక్తి రిచర్డ్ స్లేమ్యాన్(62) కన్నుమూశారు. ఇతనికి మసాచుసెట్స్ హాస్పిటల్(US) వైద్యులు మార్చిలో విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం సడన్‌గా మరణించడానికి గల కారణాలు తెలియరాలేదు. సర్జరీ సమస్యలతో కాదని ఆస్పత్రి స్పష్టం చేసింది. రిచర్డ్ ఆపరేషన్‌కు ముందు టైప్-2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారని కుటుంబసభ్యులు తెలిపారు.
Similar News
News November 6, 2025
బీఆర్ఎస్ ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవబోతున్నామని మంత్రులతో మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బైపోల్‌పై ఆయన వారితో సమీక్ష నిర్వహించారు. మిగిలిన 3 రోజుల్లో ప్రచారంలో దూకుడు పెంచాలని సూచించారు. సోషల్ మీడియాలో రోజుకో ఫేక్ సర్వే వదులుతూ ప్రజలు, ఓటర్లను బీఆర్ఎస్ గందరగోళానికి గురి చేస్తోందని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలన్నారు.
News November 6, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News November 6, 2025
WPL-2026.. రిటైన్ లిస్టు ఇదే..

WPL-2026 ఎడిషన్ కోసం ఢిల్లీలో ఈనెల 27న వేలం జరగనుంది. దీనికి ముందు 5 జట్లు పలువురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఆ జాబితా ఇదే..
RCB: స్మృతి మంధాన(3.5Cr), రిచా ఘోష్(2.75Cr), పెర్రీ(2Cr), శ్రేయాంక(60L)
MI: హర్మన్‌ప్రీత్, బ్రంట్, హేలీ, అమన్‌జోత్, కమలిని
DC: జెమీమా, షఫాలీ, అన్నాబెల్, మారిజాన్, నికి ప్రసాద్
UP వారియర్స్: శ్వేతా సెహ్రావత్
గుజరాత్: ఆష్లీ గార్డ్‌నర్, బెత్ మూనీ


