News May 12, 2024

పంది కిడ్నీ అమర్చుకున్న వ్యక్తి మృతి

image

వైద్య చరిత్రలో తొలిసారి జన్యుపరంగా మార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చుకున్న వ్యక్తి రిచర్డ్ స్లేమ్యాన్(62) కన్నుమూశారు. ఇతనికి మసాచుసెట్స్ హాస్పిటల్‌(US) వైద్యులు మార్చిలో విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం సడన్‌గా మరణించడానికి గల కారణాలు తెలియరాలేదు. సర్జరీ సమస్యలతో కాదని ఆస్పత్రి స్పష్టం చేసింది. రిచర్డ్ ఆపరేషన్‌కు ముందు టైప్-2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారని కుటుంబసభ్యులు తెలిపారు.

Similar News

News April 17, 2026

నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

image

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.

News April 17, 2026

ఐ మేకప్ వేసుకుంటున్నారా?

image

కాజల్, మస్కారా, ఐలైనర్, ఐషాడోలను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల కళ్ళకు హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు, ఇది ఎక్కువసేపు కళ్ళ పైన ఉండటం వల్ల వాటిలోని రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు కళ్ళ మెరుపును తగ్గిస్తాయంటున్నారు. అలాగే ఐ మేకప్ ప్రొడక్ట్స్ వాడే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, వాటిని ఇతరులతో పంచుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందంటున్నారు.

News April 17, 2026

తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు: హార్దిక్

image

IPL 2026లో MI వరుసగా 4వ మ్యాచ్‌లోనూ ఓటమి పాలవడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చెప్పడానికి ఏం లేదు. తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావడం లేదు. జట్టుగా విఫలమవుతున్నామా లేక ఆటగాళ్ల వ్యక్తిగత తప్పిదాలా? ప్లానింగ్‌లో లోపముందా? ఆలోచించుకొని తర్వాత ఏం చేయాలో చూస్తాం’ అని నిన్న PBKSతో ఓటమి తర్వాత అన్నారు. MI ఫెయిల్యూర్‌పై మీ అభిప్రాయం ఏంటి? Comment