News May 12, 2024

ఓల్డెస్ట్ మహిళా బిలియనీర్ సుబ్బమ్మ జాస్తి!

image

సువెన్ ఫార్మా కోఫౌండర్ వెంకటేశ్వర్లు జాస్తి తల్లి సుబ్బమ్మ(91) ఇండియాలో ఓల్డెస్ట్ మహిళా బిలియనీర్‌గా అవతరించారు. ఆమె ఆస్తి 1.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. HYDకు చెందిన ఈమె కుమారుడు వెంకటేశ్వర్లు 1970-80 మధ్య USలో 6 ఫార్మసీ‌లను నడిపేవారు. 1989లో సువెన్ ఫార్మాను ప్రారంభించారు. గత ఏడాది FEBలో అతని తండ్రి సుబ్బారావు చనిపోవడంతో తల్లికి ఆస్తిలో వాటా లభించింది.

Similar News

News April 20, 2026

విజయ్ విడాకుల కేసు.. నేడే విచారణ

image

TVK అధినేత విజయ్-సంగీత విడాకుల కేసు నేడు చెంగల్పట్టు కోర్టులో విచారణకు రానుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే విజయ్‌కు కోర్టు నోటీసులిచ్చింది. కాగా విజయ్, సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు శనివారం లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సెటిల్‌మెంట్ కింద రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.

News April 20, 2026

8th పే కమిషన్.. ఒక్కో ఉద్యోగికి రూ.10 లక్షలు!

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8th పే కమిషన్ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటికే డీఏ పెరగగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ 3.833గా ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి ఆమోదం లభిస్తే బేసిక్ శాలరీ రూ.18వేల నుంచి రూ.69వేలకు పెరగనుంది. అలాగే అరియర్స్ రూపంలో లెవల్-1 ఎంప్లాయీస్ దాదాపు రూ.10 లక్షలకు పైగా అందుకోనున్నట్లు సమాచారం. కాగా తుది నివేదికను సమర్పించడానికి 8వ వేతన సంఘానికి మే 2027 వరకు గడువు ఉంది.

News April 20, 2026

హ్యాపీ బర్త్‌డే మావయ్య: NTR

image

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హ్యాపీ బర్త్‌డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్‌తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.