News May 12, 2024
తూ.గో: ‘వీరు ఓటు కోసం 8KM నడవాలి’

రాజవొమ్మంగి మండలం లోదొడ్డి పంచాయతీ కిండంగి గ్రామానికి చెందిన గిరిజనులు ఓటు వేయాలంటే 8 కి.మీ నడవాల్సి ఉంటుంది. కొండపైన ఉన్న ఈ గ్రామంలో మొత్తం 51 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 27 మంది పురుషులు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 4 కి.మీ దూరంలో ఉన్న లోదొడ్డి గ్రామానికి వచ్చి తిరిగి వారి గ్రామానికి వెళ్ళాలి. మొత్తం 8కిమీ నడక తప్పదని గ్రామస్తులు తెలిపారు.
Similar News
News January 1, 2026
పెన్షనర్లకు అలర్ట్.. ఫిబ్రవరిలోగా లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి!

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఫిబ్రవరి 28 లోగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని డీటీఓ ఎన్. సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గురువారం RJY జిల్లా ఖజానా కార్యాలయంలో ఈ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. గడువులోగా ధ్రువీకరణ పత్రాలు అందజేయని పక్షంలో పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News January 1, 2026
జిల్లా వ్యవసాయాధికారిగా రాబర్ట్ పాల్ బాధ్యతలు

జిల్లా వ్యవసాయాధికారిగా కె. రాబర్ట్ పాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాధవరావు బుధవారం పదవీ విరమణ చేయడంతో, ఆత్మ ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉన్న రాబర్ట్ పాల్ ఇన్‌ఛార్జ్ ఏవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఏడీఏ సూర్య రమేశ్, ఏఈఓ సంఘం అధ్యక్షుడు వేణుమాధవ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా రాబర్ట్ పాల్ పేర్కొన్నారు.
News January 1, 2026
తూ.గో: ఆదిత్య వర్సిటీ ప్రో-ఛాన్సలర్‌కు జాతీయ స్థాయి అవార్డు

సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ డాక్టర్ ఎన్. సతీశ్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్’ అవార్డు లభించింది. విజయవాడలో జరిగిన ICT అకాడమీ బ్రిడ్జ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ పురస్కారం అందుకున్నట్లు ఛాన్సలర్ నల్లమిల్లి శేషారెడ్డి గురువారం తెలిపారు. ఈ గుర్తింపు లభించడంపై వర్సిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అవార్డు గ్రహీతను అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.


