News May 13, 2024
రష్యా రక్షణమంత్రి తొలగింపు!

రికార్డు స్థాయిలో ఆరోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్, అధికారంలోకి రాగానే రక్షణమంత్రి షోయిగూను తొలగించారు. మాజీ ఉప ప్రధాని ఆండ్రీ బెలౌసోవ్‌ను కొత్త రక్షణ మంత్రిగా ప్రతిపాదించారు. 2012 నుంచి మంత్రిగా ఉన్న షోయిగూను రష్యా భద్రత మండలి కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఆ పదవిలోనే కొనసాగుతారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి.
Similar News
News February 18, 2026
ఏప్రిల్ 19 నుంచి చార్‌ధామ్ యాత్ర.. రిజిస్ట్రేషన్‌కు ఫీజు!

పవిత్ర చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌కు మినిమమ్ ఫీజు వసూలు చేయనున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఫీజు ఎంతనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి, 22న కేదార్‌నాథ్, 23న బద్రీనాథ్ తెరుచుకోనున్నాయి.
News February 18, 2026
వంగలో ఆకుమాడు తెగులు – నివారణ

వంగ పంటలో నారును పొలంలో నాటిన తర్వాత 30 రోజులకు ఆకుమాడు తెగులు ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలాగే గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి, వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో దీని వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఆకుమాడు తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
News February 18, 2026
T20 WC: పాక్ ఓడితే ఇంటికే!

T20 WCలో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు సౌతాఫ్రికా-UAE, 3PMకు పాకిస్థాన్-నమీబియా, 7PMకు ఇండియా- నెదర్లాండ్స్ తలపడనున్నాయి. నేటి మ్యాచ్‌లో పాక్ గెలిస్తే S-8కు అర్హత సాధించనుంది. ఓడితే మాత్రం రన్ రేట్ ఆధారంగా USAకు అవకాశం దక్కనుంది. ఇక ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, జింబాబ్వే S-8కు వెళ్లాయి.


