News May 13, 2024

కేజ్రీవాల్ గ్యారంటీల వర్షం

image

ఎన్నికల ముంగిట ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ మరింత దూకుడు పెంచారు. ఆయన పార్టీ తాజాగా 10 గ్యారంటీలను ప్రకటించింది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చైనా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, ప్రజలందరికీ ఉచితంగా విద్య, వైద్యం, విద్యుత్, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా, ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన, సైన్యంలో అగ్నివీర్ రద్దు తదితర హామీలు వాటిలో ఉన్నాయి.

Similar News

News January 9, 2025

తొక్కిసలాట ఘటనపై సమీక్షిస్తున్నా: సీఎం చంద్రబాబు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘స్విమ్స్‌లో బాధితులను పరామర్శించాను. వారందరితో మాట్లాడాను. ఘటనపై సమీక్షిస్తున్నా. అసలేం జరిగిందన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత మీడియా ద్వారా పూర్తి వివరాలు ప్రజలకు తెలియచేస్తాను’ అని తెలిపారు. ఘటన విషయంలో అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

News January 9, 2025

సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

image

TG: ఈ నెల 13 నుంచి 24 వరకు బ్రిస్బేన్, దావోస్‌లలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ బెయిల్ కోసం అప్పట్లో పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించారు. త్వరలో పలు దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని, 6 నెలలు పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఆయన అభ్యర్థించగా కోర్టు అంగీకరించింది. జులై 6లోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది.

News January 9, 2025

BGT ఓటమికి కారణాలేంటి?.. త్వరలో బీసీసీఐ రివ్యూ మీటింగ్

image

BGT సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్‌తో త్వరలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, BCCI అధికారులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గంభీర్, స్టాఫ్ తీరుపై పలువురు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ద్రవిడ్ టైమ్‌తో పోలిస్తే కమ్యూనికేషన్ సరిగా లేదని వస్తున్న ఆరోపణలపై దృష్టిసారిస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.