News January 9, 2025

BGT ఓటమికి కారణాలేంటి?.. త్వరలో బీసీసీఐ రివ్యూ మీటింగ్

image

BGT సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్‌తో త్వరలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, BCCI అధికారులు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గంభీర్, స్టాఫ్ తీరుపై పలువురు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ద్రవిడ్ టైమ్‌తో పోలిస్తే కమ్యూనికేషన్ సరిగా లేదని వస్తున్న ఆరోపణలపై దృష్టిసారిస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News January 20, 2025

నాగ సాధువులు నగ్నంగా ఎందుకు ఉంటారు?

image

నాగసాధువులు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉంటారు. దీనికి కారణం వారు ఎలాంటి కోరికలు లేకుండా ఉండటమే. మనిషి ప్రపంచంలోకి నగ్నంగా వస్తాడని ఇదే సహజ స్థితి అని వారు నమ్ముతారు. ఈ భావనతోనే వారు దుస్తులు ధరించరని చెబుతారు. ప్రతికూల శక్తుల నుంచి రక్షించేందుకు పవిత్రమైనదిగా భావించే బూడిదను ఒంటికి పూసుకుంటారు. వారు చేసే సాధనలు, అభ్యాసాలతో ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని జీవిస్తారు.

News January 20, 2025

అమెరికాలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రభంజనం

image

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అమెరికాలో భారీగా కలెక్షన్లు రాబడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా $2 మిలియన్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. గతంలో లేని విధంగా పండగకు ప్రభంజనం సృష్టిస్తోందని తెలిపింది. మరోవైపు ఓవరాల్‌గా ఈ సినిమా కలెక్షన్లు రూ.200 కోట్లకు చేరువైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

News January 20, 2025

కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగింది ఏమిటి?: కేటీఆర్

image

TG: ఏడాది కాంగ్రెస్ పాలనలో కటింగులు, కటాఫ్‌లు మినహా తెలంగాణకు ఒరిగింది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ, రైతుభరోసా, కరెంట్, కేసీఆర్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మీ రూ.2,500తో సహా ఇచ్చిన హామీలన్నింటిలోనూ కటింగ్ చేస్తుందని దుయ్యబట్టారు. ‘అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు కట్టించి ఎందుకు ఇవ్వరు? డబుల్ బెడ్రూంలకు మూడురంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్? జాగో తెలంగాణ జాగో’ అని రాసుకొచ్చారు.