News May 13, 2024

అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల!

image

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిసి కనిపిస్తుంటే హైదరాబాద్‌లో బోసిపోయి కనిపిస్తున్నాయి. ఓటర్ల కోసం పోలింగ్ సిబ్బంది సైతం వేచిచూస్తున్నారు. చాలా మంది సెటిలర్లకు ఏపీలోనూ ఓటు హక్కు ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్లంతా సొంతూళ్లకు తరలివెళ్లారు. దీంతో దాదాపు 20 శాతం ఓటింగ్ తగ్గేలా కనిపిస్తోంది.

Similar News

News March 14, 2026

డైరెక్టర్‌గా శేఖర్ మాస్టర్.. హీరోగా ప్రభుదేవా కుమారుడు?

image

డాన్స్ కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారడం కొత్తేం కాదు. ఇప్పుడు ఈ లిస్టులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేరబోతున్నట్లు సమాచారం. ఆయన తెరకెక్కించే సినిమాతో ప్రభుదేవా కుమారుడు రిషిల్ రాఘవేంద్ర దేవా హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మే నుంచి షూటింగ్ ఉంటుందని, త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలిపాయి. మ్యూజిక్, డాన్స్‌కి ప్రాధాన్యమున్న స్టోరీతో ఈ మూవీ రానుందట.

News March 14, 2026

ఇరాన్‌పై దాడులు.. 2 వారాల్లో 2,000 మంది మృతి!

image

ఇరాన్‌పై US&ఇజ్రాయెల్ గత 2 వారాలుగా జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 2వేల మందికి పైగా చనిపోయారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ఈ యుద్ధంలో మరణించిన అమెరికన్ సైనికుల సంఖ్య 11కి చేరింది. ఈ లిస్టులో వెస్టర్న్ ఇరాక్‌లో క్రాష్ అయిన రీఫ్యుయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బంది ఆరుగురు కూడా ఉన్నారు. ఇక తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 100+ మంది పిల్లలు మరణించినట్లు లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.

News March 14, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 14)

image

1879: భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం (ఫొటోలో)
1883: తత్వవేత్త, రాజకీయ ఆర్థికవేత్త కారల్ మార్క్స్ మరణం
1917: సినీ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ జననం
1931: భారత్‌లో తొలి టాకీ మూవీ ‘ఆలం ఆరా’ విడుదల
1965: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ జననం
2008: శంషాబాద్ విమానాశ్రయ ప్రారంభోత్సవం
2018: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం
* అంతర్జాతీయ గణిత దినోత్సవం