News May 13, 2024
మాచర్లలో మరోసారి ఉద్రిక్తత

AP: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. పాల్వాయిగేటు వద్ద జరిగిన ఈ దాడిలో ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. మరోవైపు గన్నవరం నియోజకవర్గంలోని ముస్తాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Similar News
News March 3, 2026
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్‌ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.
News March 3, 2026
ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

బిహార్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్‌లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.
News March 3, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<


