News May 14, 2024
డోంట్ వర్రీ..T20 WCలో రోహిత్ అద్భుతంగా ఆడతాడు: గంగూలీ
IPLలో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శనతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న వేళ BCCI మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ‘భారత జట్టు అత్యుత్తమమైనది. ప్రపంచకప్‌లో రోహిత్ అద్భుతంగా ఆడతాడు. బిగ్ టౌర్నమెంట్స్‌లో రోహిత్ తన బెస్ట్ ఇస్తాడు. కాబట్టి ఫ్యాన్స్ అతని ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని గంగూలీ చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది.
Similar News
News January 8, 2025
APPLY NOW.. 600 ఉద్యోగాలు
SBI 600 పీఓ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. జనవరి 16 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది. వెబ్‌సైట్: <
News January 8, 2025
తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా?: హైకోర్టు
తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా అని బొంబాయి హైకోర్టు ప్రశ్నించింది. అలాంటివారికి తల్లి అయ్యే హక్కు లేదని చెప్పడం సరికాదని పేర్కొంది. తన కుమార్తెకు 21 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు పెళ్లి కూడా కాలేదని, మానసిక స్థితి బాగాలేదని తెలిపారు. మరోవైపు ఆమె తల్లి అయ్యేందుకు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారని వైద్యులు కోర్టుకు తెలిపారు.
News January 8, 2025
BREAKING: ఫలితాలు విడుదల
తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఫలితాలను TGPSC విడుదల చేసింది. ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను వెబ్‌సైటులో అందుబాటులో ఉంచింది. 2023 జులైలో TPBO ఉద్యోగాలకు రాత పరీక్ష జరగ్గా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <