News January 8, 2025
APPLY NOW.. 600 ఉద్యోగాలు
SBI 600 పీఓ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. జనవరి 16 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది. వెబ్‌సైట్: <
Similar News
News January 16, 2025
సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ సభ: మహేశ్ కుమార్
TG: ఫిబ్రవరి రెండో వారంలోపు సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. రాహుల్ తెలంగాణ టూర్, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇవాళ ఆయన ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు. క్యాబినెట్ విస్తరణపై పార్టీ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని మహేశ్ వెల్లడించారు.
News January 16, 2025
పుష్ప-3 అప్డేట్ చెప్పిన DSP
పుష్ప-3 కోసం సుకుమార్ నిరంతరం పనిచేస్తున్నారని DSP వెల్లడించారు. స్టోరీపై రీవర్క్ కూడా జరుగుతోందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పుష్ప-2లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. ప్రతి టెక్నీషియన్ బాగా కష్టపడ్డారు. వర్క్ విషయంలో నేనెప్పుడూ టెన్షన్ పడను. ఒత్తిడికి గురైతే క్రియేటివిటీ ఉండదు. సుకుమార్ విజన్, ఆయన స్టోరీలు మాకు స్ఫూర్తి. రెండు పార్టుల కోసం కష్టపడినట్లుగానే పుష్ప-3 కోసం పనిచేస్తాం’ అని తెలిపారు.
News January 16, 2025
4 కొత్త పథకాలు.. సీఎస్ కీలక ఆదేశాలు
TG: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమావేశమయ్యారు. ఇప్పటికే విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులను గుర్తించి జాబితాలను ఈ నెల 21 నుంచి గ్రామసభల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. GHMCలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.