News May 14, 2024

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్న కేంద్రం!

image

కుటుంబమంతా కలిసి చూసే విలువలతో కూడిన కంటెంట్‌ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానుందట. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాలను చూపించడమే లక్ష్యంగా ఇందులోని కంటెంట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వినోదంతో పాటు కరెంట్ అఫైర్స్‌ను ఇందులో కవర్ చేస్తారట. ఏడాది లేదా రెండేళ్లు ఉచితంగా సేవలు అందించి, ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ ధరలు నిర్ణయిస్తారని సమాచారం.

Similar News

News January 8, 2025

బాలకృష్ణకు అలా పిలిస్తేనే ఇష్టం: శ్రద్ధా శ్రీనాథ్

image

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తనను ‘సార్’ అని పిలవొద్దని చెప్పేవారని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తెలిపారు. ‘బాలా’ అని పిలవాలని సూచించేవారని చెప్పారు. ‘బాలయ్య సెట్స్‌లో చాలా కూల్‌గా ఉంటారు. ఆయన దర్శకుల హీరో. డైరెక్టర్ ఏది చెబితే అది మొహమాటం లేకుండా చేస్తారు. దర్శకుడికి పూర్తిగా లొంగిపోతారు. డాకు మహారాజ్‌లో నటించడం నా అదృష్టం’ అని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది.

News January 8, 2025

APPLY NOW.. 600 ఉద్యోగాలు

image

SBI 600 పీఓ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. జనవరి 16 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ. ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది. వెబ్‌సైట్: <>sbi.co.in <<>>

News January 8, 2025

తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా?: హైకోర్టు

image

తెలివి తక్కువ వాళ్లు తల్లి కాకూడదా అని బొంబాయి హైకోర్టు ప్రశ్నించింది. అలాంటివారికి తల్లి అయ్యే హక్కు లేదని చెప్పడం సరికాదని పేర్కొంది. తన కుమార్తెకు 21 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు పెళ్లి కూడా కాలేదని, మానసిక స్థితి బాగాలేదని తెలిపారు. మరోవైపు ఆమె తల్లి అయ్యేందుకు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారని వైద్యులు కోర్టుకు తెలిపారు.