News May 14, 2024
పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు
AP: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న కొందరు YCP కార్యకర్తల ఇళ్లను TDP నేతలు కూల్చేశారు. దీంతో మహిళలు రాత్రంతా గుడిలో తలదాచుకున్నారు. అటు తమ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్లిన గురజాల MLA కాసు మహేశ్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌పై కొందరు TDP కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
Similar News
News January 10, 2025
ఏడాదికి 10వేల కోట్ల అరటిపండ్లు లాగిస్తున్నారు
అరటిపండు పోషకాలు కలిగి ఉండటం వల్ల, రోజుకు ఒకటైనా తినడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. దీంతో ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పండుగా అరటిపండుకు పేరుంది. ఏటా 100 బిలియన్ల(10వేల కోట్లు) కంటే ఎక్కువ అరటిపండ్లను లాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోషక ప్రయోజనాలు, సౌలభ్యం కారణంగా దీనికి ప్రజాదరణ లభించింది. చాలా చోట్ల ఆహారంలో అరటిపండునూ భాగం చేస్తుంటారు.
News January 10, 2025
దేశంలో లాక్డౌన్ అంటూ ప్రచారం.. స్పందించిన PIB
దేశంలో hMPV వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం లాక్డౌన్ విధించిందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం ‘లాక్డౌన్’ థంబ్‌నెయిల్స్‌తో అసత్యపు ప్రచారం చేస్తుండటంతో కేంద్రానికి చెందిన PIB FACTCHECK స్పందించింది. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని, కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకూ ఏదీ నమ్మొద్దని తెలిపింది.
News January 10, 2025
హిందీ జాతీయ భాష కాదు: అశ్విన్
టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష అనేది కేవలం అధికార భాష మాత్రమేనని దానికి జాతీయ హోదా లేదని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న అశ్విన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇలా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులకు అశ్విన్ వీడ్కోలు చెప్పారు.