News May 14, 2024
కేంద్రంలో దొరల పాలన నడుస్తోంది: జైరామ్
మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు. వారు నడిపించేది లోక్‌తంత్ర కాదని, ధనతంత్ర(దొరల పాలన) అని ఆరోపించారు. ప్రస్తుతం దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయన్నారు. వాటిని కాపాడేందుకే తాము ఈ ఎన్నికల్లో పోరాడుతున్నామని పేర్కొన్నారు. మోదీ అయోమయంలో ఉన్నారని, అందుకే హిందూ-ముస్లిం, మంగళసూత్రం, అంబానీ-అదానీ అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Similar News
News January 10, 2025
దేశంలో లాక్డౌన్ అంటూ ప్రచారం.. స్పందించిన PIB
దేశంలో hMPV వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం లాక్డౌన్ విధించిందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం ‘లాక్డౌన్’ థంబ్‌నెయిల్స్‌తో అసత్యపు ప్రచారం చేస్తుండటంతో కేంద్రానికి చెందిన PIB FACTCHECK స్పందించింది. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని, కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకూ ఏదీ నమ్మొద్దని తెలిపింది.
News January 10, 2025
హిందీ జాతీయ భాష కాదు: అశ్విన్
టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష అనేది కేవలం అధికార భాష మాత్రమేనని దానికి జాతీయ హోదా లేదని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న అశ్విన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇలా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులకు అశ్విన్ వీడ్కోలు చెప్పారు.
News January 10, 2025
రూ.700 కోట్ల లాభాలు ఎక్కడో కేటీఆర్ చూపాలి: బండి సంజయ్
TG: ఈ-కార్ రేస్ కేసులో KTR అరెస్టయితే ఆందోళన అవసరం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆయనేమైనా దేశం కోసం పోరాడారా అని ప్రశ్నించారు. KCR, రేవంత్ కుటుంబాల మధ్య ఏదో ఒప్పందం ఉందని, అందుకే కేసులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. KCR ఫ్యామిలీ అంతా అవినీతిమయమన్నారు. ఈ-కార్ రేసులో ప్రభుత్వానికి రూ.700 కోట్ల లాభాలు ఎక్కడొచ్చాయో చూపించాలని డిమాండ్ చేశారు.