News May 14, 2024

హోర్డింగ్ కూలిన ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు

image

ముంబైలో హోర్డింగ్ <<13244596>>కుప్పకూలిన<<>> ఘటనలో ‘ఇగో మీడియా’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదైంది. అతడి గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా హోర్డింగ్‌లు పెట్టినందుకు భవేశ్‌కు 20సార్లకు పైగా అధికారులు ఫైన్ విధించారు. కుప్పకూలిన హోర్డింగ్‌కూ అతను అనుమతి తీసుకోలేదట. ఆ ప్రాంతంలో అనుమతి ఉన్న గరిష్ఠ పరిమాణం కన్నా అది 9 రెట్లు పెద్దదని తేలింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Similar News

News January 1, 2025

విశ్వ వేదికపై విజయ గీతికగా TG ప్రస్థానం ఉండాలి: CM

image

TG: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి,రజినీకాంత్, కమల్ హాసన్, ఎన్టీఆర్ తదితరులు కూడా X వేదికగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు.

News January 1, 2025

నిన్న భారీగా కండోమ్ అమ్మకాలు!

image

ప్రముఖ గ్రాసరీ డెలివరీ యాప్ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’లో నిన్న భారీగా కండోమ్ ప్యాకెట్లు ఆర్డర్ వచ్చినట్లు సంస్థ పేర్కొంది. నిన్న సాయంత్రం 5.30 వరకే 4779 కండోమ్స్ బుక్ అయినట్లు తెలిపింది. వీటితోపాటు రాత్రి 7.30 వరకు 2.21 లక్షల చిప్స్ ప్యాకెట్లు అమ్ముడయ్యాయంది. అయితే, నిన్న రాత్రి వచ్చిన ఆర్డర్లలో ప్రతి 8లో ఒకటి ఇతరుల కోసం ఆర్డర్ చేసినవేనని, ఇది మదర్స్ డే, వాలెంటైన్స్ డేను అధిగమించిందని తెలిపింది.

News January 1, 2025

BGT: పుజారాను సెలక్టర్లే వద్దన్నారా?

image

BGTలో సీనియర్ బ్యాటర్ పుజారాను ఆడించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కానీ ఆయన ప్రతిపాదనను సెలక్టర్లు తిరస్కరించారని పేర్కొన్నాయి. నాలుగో టెస్టులో ఓటమి అనంతరం ఆటగాళ్లపై గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, పరిస్థితులకు తగ్గట్లు ఆడట్లేదని ఆగ్రహించినట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా AUSలో 11 మ్యాచులు ఆడిన పుజారా 47.28 AVGతో 993 రన్స్ చేశారు.