News May 14, 2024

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పులివర్తి నాని

image

AP: కొందరు వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిలో గాయపడ్డ చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇదే దాడిలో నాని గన్‌మెన్ కూడా గాయపడ్డారు. అతడిని ఓ వ్యక్తి సమ్మెటతో దాడి చేయగా.. కణత భాగంలో గాయమైంది.

Similar News

News January 1, 2025

ఐదో టెస్టుకు ఆస్ట్రేలియా జెర్సీ ఇదే

image

IND, AUS మధ్య ఐదో టెస్ట్ (పింక్ టెస్ట్) ఈనెల 3 నుంచి జరగనుంది. ఈ మ్యాచుకు స్టేడియం మొత్తం పింక్ కలర్‌లో దర్శనమివ్వనుంది. AUS ప్లేయర్లు సైతం పింక్ క్యాప్స్ ధరిస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు మద్దతుగా 2009 నుంచి పింక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. 2008లో తన భార్య క్యాన్సర్‌తో చనిపోవడంతో మెక్‌గ్రాత్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ రోగుల కోసం ఫండ్స్ సేకరిస్తున్నారు.

News January 1, 2025

తగ్గిన సిలిండర్ ధర

image

కొత్త ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. రూ.14.50 తగ్గడంతో ఢిల్లీలో గ్యాస్ ధర రూ.1804కు చేరింది. ప్రస్తుతం HYDలో సిలిండర్ ధర రూ.2014గా ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.

News January 1, 2025

2025లో ప్రపంచయుద్ధం?

image

నోస్ట్రడామస్, బాబా వంగా ఇద్దరూ ఎన్నో ఏళ్ల ముందుగానే పలు ఘటనల్ని కచ్చితత్వంతో అంచనా వేశారు. 2025 గురించి వీరు చెప్పిన జోస్యం పాశ్చాత్య దేశాల ప్రజల్ని భయపెడుతోంది. ఈ ఏడాది ఐరోపాలో ప్రపంచయుద్ధం స్థాయిలో పరిస్థితులు నెలకొంటాయని వారు చెప్పారు. బ్రిటన్‌లో మహమ్మారి తిరిగి వస్తుందని, USలో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అన్నారు. ప్రపంచ ఆధిపత్యం తూర్పుదేశాల చేతికి వస్తుందని జోస్యం చెప్పారు.