News May 14, 2024

TG: రానున్న 2 గంటల్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. MBNR, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Similar News

News January 1, 2025

BGT: పుజారాను సెలక్టర్లే వద్దన్నారా?

image

BGTలో సీనియర్ బ్యాటర్ పుజారాను ఆడించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కానీ ఆయన ప్రతిపాదనను సెలక్టర్లు తిరస్కరించారని పేర్కొన్నాయి. నాలుగో టెస్టులో ఓటమి అనంతరం ఆటగాళ్లపై గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, పరిస్థితులకు తగ్గట్లు ఆడట్లేదని ఆగ్రహించినట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా AUSలో 11 మ్యాచులు ఆడిన పుజారా 47.28 AVGతో 993 రన్స్ చేశారు.

News January 1, 2025

రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి BIG UPDATE

image

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి చిత్ర యూనిట్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. జనవరి 2వ తేదీ సాయంత్రం 5.04 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ఆట మొదలైంది అంటూ చరణ్ పంచె కట్టుతో ఉన్న ఫొటోను పంచుకుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది.

News January 1, 2025

ఐదో టెస్టుకు ఆస్ట్రేలియా జెర్సీ ఇదే

image

IND, AUS మధ్య ఐదో టెస్ట్ (పింక్ టెస్ట్) ఈనెల 3 నుంచి జరగనుంది. ఈ మ్యాచుకు స్టేడియం మొత్తం పింక్ కలర్‌లో దర్శనమివ్వనుంది. AUS ప్లేయర్లు సైతం పింక్ క్యాప్స్ ధరిస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు మద్దతుగా 2009 నుంచి పింక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. 2008లో తన భార్య క్యాన్సర్‌తో చనిపోవడంతో మెక్‌గ్రాత్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ రోగుల కోసం ఫండ్స్ సేకరిస్తున్నారు.