News May 15, 2024
హైదరాబాద్ జూలో ‘అభిమన్యు’ మృతి
హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల పులి ‘అభిమన్యు’ అనారోగ్యంతో మృతిచెందింది. ఇది అరుదైన తెలుపు బెంగాల్ టైగర్ కావడం గమనార్హం. బద్రి, సురేఖ అనే పులులకు 2015, జనవరి 2న ఇదే జూలో ఈ పులి జన్మించింది. నెఫ్రిటిస్ సమస్యతో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇబ్బంది పడుతోందని జూ అధికారులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో కొన్ని రోజులుగా ఆహారం తినలేదని, మంగళవారం మధ్యాహ్నం ప్రాణం విడిచిందని వెల్లడించారు.
Similar News
News January 6, 2025
సౌతాఫ్రికాతో టెస్ట్.. ఎదురొడ్డుతున్న పాక్
పాక్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన PAK తొలి ఇన్నింగ్స్‌లో 194 రన్స్‌కే పరిమితమైంది. ఫాలో ఆన్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా ఆ జట్టు బ్యాటర్లు రాణించారు. ఓపెనర్లు మసూద్ సెంచరీ(102*) చేయగా బాబర్ 81 రన్స్‌తో రాణించారు. తొలి వికెట్‌కు 205 రన్స్ జోడించారు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి PAK ఇంకా 208 రన్స్ వెనుకంజలో ఉంది.
News January 6, 2025
శుభ ముహూర్తం (06-01-2025)
✒ తిథి: శుక్ల సప్తమి రా.7:03 వరకు ✒ నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.25 వరకు ✒ శుభ సమయం: ఉ.5.46-6.22, సా.6.58-7.22 ✒ రాహుకాలం: ఉ.7.30-9.00 ✒ యమగండం: ఉ.10.30-మ.12.00 ✒ దుర్ముహూర్తం: మ.12.24-1.12, మ.2.46-3.34 ✒ వర్జ్యం: ఉ.6.44-8.15 ✒ అమృత ఘడియలు: సా.4.51-6.22.
News January 6, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 6, సోమవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు ✒సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5.56 గంటలకు ✒ ఇష: రాత్రి 7.13 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.