News May 15, 2024
మొత్తం ఇండియా నాకు మద్దతుగా నిలిచింది: పంత్

తీవ్ర ప్రమాదం కారణంగా ఏడాదిన్నర పాటు క్రికెట్‌కు దూరమయ్యారు రిషభ్ పంత్. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తనకు లభించిన మద్దతుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏ స్టేడియంలో మ్యాచ్ ఆడినా భారతీయులంతా తనకు మద్దతుగా నిలిచారని కొనియాడారు. ఇప్పుడు 24 గంటలూ గ్రౌండ్‌లోనే ఉండాలని అనిపిస్తోందని తెలిపారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంత్ 13 మ్యాచుల్లో 446 పరుగులు చేశారు. వాటిలో 3 హాఫ్ సెంచరీలున్నాయి.
Similar News
News March 25, 2026
నంద్యాల మునిసిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్

నంద్యాల మునిసిపాలిటీని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లి ఉత్తమ మునిసిపాలిటీగా నిలబెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మునిసిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అనంతరం పట్టణ అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేశారు.
News March 25, 2026
IPL: కెప్టెన్లంతా ఒకే చోట

ఐపీఎల్-2026 సందడి మొదలైంది. లీగ్‌లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు ముంబైలో ఒకేచోట కలుసుకున్నారు. సీజన్ ప్రారంభానికి ముందు ఏటా జరిగే ‘కెప్టెన్స్ ఫొటోషూట్’లో వీరంతా పాల్గొన్నారు. హార్దిక్ పాండ్య, రుతురాజ్ గైక్వాడ్, రజత్, పంత్, కిషన్, రహానే, పరాగ్, అక్షర్, గిల్, శ్రేయస్ కలిసున్న ఫొటోలను IPL పంచుకుంది. ఈ నెల 28 నుంచి ఈ క్రికెట్ పండుగ షురూ కానున్న విషయం తెలిసిందే.
News March 25, 2026
ఫ్రూట్-ఫ్లేవర్డ్ బీర్లు ఇక రానట్లే

TG: రాష్ట్రంలో పండ్లు, ఇతర ఫ్లేవర్డ్ బీర్లను అందుబాటులోకి తెచ్చేందుకు GOVT గతంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటు కోసం టెండర్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ బ్రూవరీల ద్వారా ప్రతినెల ₹100CR ఆదాయాన్ని ఆర్జించవచ్చనుకుంది. HYDలో 100కు పైగా, ఇతర కార్పొరేషన్లలో20కి పైగా దరఖాస్తులు అందాయి. అయితే టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు లేకపోవడంతో దరఖాస్తులను తిరస్కరించింది.


