News May 15, 2024
ఓటర్ల కోసం రైలుకు గ్రీన్ ఛానల్
ఎన్నికల అధికారుల చొరవతో దాదాపు వెయ్యి మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 12న నాందేడ్ నుంచి విశాఖ వస్తున్న రైలు ఆలస్యంగా నడిచింది. పోలింగ్‌కు దూరమవుతామని ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో ఎన్నికల సంఘం రైలు ఎక్కడా ఆపకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటుచేయించారు. దీంతో రా.8 తర్వాత విశాఖ చేరుకోవాల్సిన ట్రైన్ సా.5.15కే చేరుకోవడంతో కొందరు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు.
Similar News
News January 11, 2025
ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది: KCR
TG: ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలని BRS నేతలకు KCR సూచించారు. నిన్న KTR, పలువురు పార్టీ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ గురించి ఆయనకు KTR వివరించారు. ‘అధికారం చేపట్టిన ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది. సంక్రాంతి తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. ఫిబ్రవరి/మార్చిలో బహిరంగ సభ నిర్వహిద్దాం’ అని ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
News January 11, 2025
నేడు పులివెందులకు వైఎస్ జగన్
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం YS జగన్ ఇవాళ పులివెందుల వెళ్లనున్నారు. YCP వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డా.YS అభిషేక్ రెడ్డి(36) అంత్యక్రియలకు హాజరు కానున్నారు. పులివెందులలోని YS కుటుంబ సభ్యుల సమాధుల తోటలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. జగన్ పెదనాన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి. జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మృతిచెందిన విషయం తెలిసిందే.
News January 11, 2025
రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలతో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఆదివారం భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.